Site icon Prime9

Supreme Court Orders: ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిటంటే..

Supreme Court

Supreme Court

Supreme Court Orders: ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

వెబ్‌సైట్‌‌‌ను సిద్ధం చేసుకోవాలి..(Supreme Court orders)

ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌‌‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.ఎవరైనా ప్రజాప్రతినిధిపై తీవ్ర నేరాలను సంబంధించి అభియోగం నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

Exit mobile version