Site icon Prime9

Love Marriage: ప్రేమ వివాహాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. విడాకులు తీసుకునేది ఎక్కువ వీళ్లేనట

YS Viveka Murder case

YS Viveka Murder case

Love Marriage:ప్రేమ వివాహాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వారే ఎక్కువ విడాకులు తీసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు వ్యాఖ్యనించింది. ఓ కేసు ట్రాన్స్‌ఫ‌ర్ పిటీష‌న్‌పై స్పందించిన ధర్మాసనం.. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

విడాకులు..

ప్రేమ వివాహాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వారే ఎక్కువ విడాకులు తీసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు వ్యాఖ్యనించింది. ఓ కేసు ట్రాన్స్‌ఫ‌ర్ పిటీష‌న్‌పై స్పందించిన ధర్మాసనం.. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో పరిష్కారం కోసం మధ్యవర్తిత్వాన్ని సుప్రీం సూచించింది.

ప్రస్తుత కాలంలో విడాకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పెళ్లైన కొద్దీ రోజులకే విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకున్నవారే ఉన్నారట.
జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, సంజ‌య్ కార‌ల్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ కేసు ట్రాన్స్‌ప‌ర్ పిటీష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఆ స‌మ‌యంలో ఆ పెళ్లి.. ప్రేమ వివాహం అని కోర్టుకు తెలిపారు.

ఆ సంద‌ర్భంలో జ‌స్టిస్ గ‌వాయి స్పందిస్తూ.. ఎక్కువ శాతం డైవ‌ర్స్ కేసుల‌న్నీ ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న‌వారి నుంచే వ‌స్తున్నాయ‌ని అన్నారు. అయితే ఆ కేసులో మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని కోర్టు సూచించింది. కానీ దాన్ని భ‌ర్త వ్య‌తిరేకించారు. ఇలాంటి సంద‌ర్భంలో ఇటీవ‌ల వ‌చ్చిన ఓ తీర్పును ఆధారంగా చేసుకుని, భ‌ర్త ఆమోదం లేకుండానే ఆ జంట‌కు విడాకులు ఇవ్వ‌వ‌చ్చు అని కోర్టు తెలిపింది. కానీ మ‌ధ్య‌వ‌ర్తిత్వం త‌ప్ప‌నిస‌రి అని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది.

Exit mobile version