Site icon Prime9

Prajwal Revanna Sexual Abuse Case: సిట్‌ అధికారులను అడ్డుకున్న ఎంపీ ప్రజ్వల్ రేవన్న మద్దతుదారులు!

MP Prajwal Revanna

MP Prajwal Revanna

 Prajwal Revanna Sexual Abuse Case:కర్ణాటక హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రెవన్న, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్‌డీ రెవన్నలు మహిళలపై అత్యాచారాల కేసులు, సెక్స్‌ టేప్‌ల కేసులు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసింది. కాగా ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు కర్ణాటకలోని పలు పోలీసు స్టేషన్లలో తమపై తుపాకి చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడని పలువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్‌ పోలీసుల నుంచి తప్పించుకుని ఫ్రాంక్‌ఫర్ట్‌ వెళ్లిపోయాడు. ఈ సెక్స్‌ టేపుల విషయానికి వస్తే కర్ణాటకలో సిద్ద రామయ్య ప్రభుత్వం ఈ కేసులను చేజించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది.

బ్లూ కార్నర్ నోటీసు..( Prajwal Revanna Sexual Abuse Case)

సిట్‌ అధికారులు సాక్ష్యాలు సేకరించడానికి హోలినరసిపూర్‌లో జెడీ ఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రెవన్న ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తే… రెవన్న మద్దతుదారులు అధికారులను అడుగడుగునా అడ్డుకున్నారు. కాగా ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌డీ రెవన్న ఆచూకి తెలుసుకునేందుకు రెండో లుక్‌అవుట్‌ నోటీసును సిట్‌ అధికారులు శనివారం నాడు జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రధాన నిందితుడు హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రెవన్నను దేశంలోకి రప్పించడానికి సీబీఐ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా దర్యాప్తు జరుగుతున్న తీరును సిటి అధికారులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సిద్దరామయ్యకు ఓ లేఖ రాశారు. రెవెన్న, ప్రజ్వల్‌ చేతిలో అత్యాచారాలకు గురైన బాధిత మహిళలకు అండగా ఉండాలని కోరారు. నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

ఇదిలా ఉండగా కర్నాటక హోంమంత్రి జీ పరమేశ్వర శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రంలోగా రెవెన్న సిట్‌ అధికారుల ముందు హాజరై విచారణను ఎదుర్కొవాలని సూచించారు. రెవన్నకు వ్యతిరేకంగా రెండవ నోటీసు పంపించామన్నారు హోంమంత్రి. రెవన్నతో పాటు ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేశామన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం రెవన్న కూడా విదేశాలకు పారిపోవాలని చూస్తున్నాడని తెలిసిందన్నారు. ఈ రోజు సాయంత్రంలోగా సిట్‌ అధికారుల ముందు హాజరు కావాల్సిందే. మైసూర్‌లో ఓ మహిళ కిడ్నాప్‌ కేసు కూడా ఆయనపై నమోదు చేశామన్నారు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసిందన్నారు హోంమంత్రి. ప్రభుత్వం మాత్రం ఈ కేసులో ఉదాసీనత చూపించే ప్రసక్తి లేదన్నారు పరమేశ్వర.

Exit mobile version