Bindeshwar Pathak: సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు మరియు సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మంగళవారం మరణించారు. 80 ఏళ్ల పాఠక్ భారతదేశంలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడంలో పలువురికి మార్గదర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం జాతీయ జెండాను ఎగురవేసిన పాఠక్ ఆ వెంటనే కుప్పకూలిపోయాడని సన్నిహితుడు తెలిపారు. వెంటనే అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
బిందేశ్వర్ పాఠక్ స్వస్థలం బీహార్‌లోని వైశాలి జిల్లా. అతని స్వగ్రామం రాంపూర్ బాఘేల్. మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని అంతం చేయడానికి అతను చాలా ప్రయత్నం చేశారు. 1968లో బీహార్ గాంధీ శతాబ్ది ఉత్సవాల కమిటీకి చెందిన భాంగీ-ముక్తి (స్కావెంజర్ల విముక్తి) సెల్‌లో చేరినప్పుడు స్కావెంజర్ల కష్టాలను అతను అర్థం చేసుకున్నారు. పాఠక్‌కు 1991లో పద్మభూషణ్ కూడా లభించింది. సులభ్ ఇంటర్నేషనల్ దేశవ్యాప్తంగా దాదాపు 8500 టాయిలెట్లు మరియు బాత్‌రూమ్‌లను కలిగి ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ X (గతంలో ట్విట్టర్‌గా పిలిచేవారు) లో పాఠక్ మృతికి సంతాపాన్ని తెలియజేసారు.సామాజిక ప్రగతికి, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆయన విస్తృతంగా కృషిచేస్తున్నారని ప్రధాన మంత్రి కొనియాడారు. బిందేశ్వర్ జీ పరిశుభ్రమైన భారతదేశాన్ని నిర్మించడమే తన లక్ష్యం. స్వచ్ఛ భారత్ మిషన్‌కు ఆయన స్మారక మద్దతును అందించారు. మా ఇద్దరి సంభాషణల సమయంలో, స్వచ్ఛత పట్ల అతని అభిరుచి ఎల్లప్పుడూ కనిపించేదని ఆయన పేర్కొన్నారు.అతని పని చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి మరియు ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని ప్రధాని మోదీ ట్వీట్ చేసారు.