Suicide Attack : పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 39 మంది మృతి.. 200 చేరే అవకాశం..?

పాకిస్థాన్ లో వరుస బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని భయం భయ,గా బ్రతుకుతున్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరో భయానక ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లోని బజౌర్స్ ఖర్ పట్టణంలో జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్-ఫజల్ సంస్థకు చెందిన మతపరమైన సమ్మేళనం జరుగుతుండగా

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 11:37 AM IST

Suicide Attack : పాకిస్థాన్ లో వరుస బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని భయం భయ,గా బ్రతుకుతున్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరో భయానక ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లోని బజౌర్స్ ఖర్ పట్టణంలో జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్-ఫజల్ సంస్థకు చెందిన మతపరమైన సమ్మేళనం జరుగుతుండగా, ఓ వ్యక్తి తనను తాను పేల్చివేసుకున్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో 39 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 200కి చేరే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

సాయంత్రం 4 గంటలకు ఈ పేలుడు సంభవించిందని క్షతగాత్రుల్లో ఒకరు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని, తేరుకుని చూశాక పొగ, దుమ్ము, ధూళి కమ్మేసిందని, తెగిపడిన అవయవాలతో ఆ ప్రదేశమంతా బీభత్సంగా మారిందని ఆదామ్ ఖాన్ అనే బాధితుడు వెల్లడించారు. కాగా పేలుడు ధాటికి తీవ్ర విధ్వంసం నెలకొనగా.. మనుష్యుల శరీరాలు ఛిద్రమై.. ఘటనా స్థలంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరపాలని జమియత్ ఉలేమా సంస్థ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రహ్మాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సీఎం అజామ్ ఖాన్ లను డిమాండ్ చేశారు.
కాగా ఈ ఆత్మాహుతి దాడికి తమదే బాధ్యత అని ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు.