Site icon Prime9

బెంగళూరు: ఇన్ఫోసిస్ వేడుకలో డ్యాన్స్ చేసిన సుధామూర్తి

Sudhamurthy

Sudhamurthy

Sudhamurthy: ఇన్ఫోసిస్ వ్యవస్దాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి అంటే తెలియని వారు లేరు. తనదైన సింప్లిసిటీ, వ్యక్తిత్వంతో ఉండే సుధామూర్తి డ్యాన్స్ చేసిన వీడియో ఇపుడు వైరల్ అయింది. బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవ వేడుకల్లో గాయని శ్రేయాఘోషల్ శ్రేయాఘోషల్ కూడా పాల్గొంది. అందరూ కలిసి ఒక గ్రూపులా నిలుచుని ఉండగా శ్రేయాఘోషల్ మణిరత్నం దర్శకత్వం వహించిన గురు సినిమాలోని ‘బరుసోరే మేఘ మేఘ..’ పాట పాడింది.

ఈ పాటకు అనుగుణంగా సుధామూర్తి డ్యాన్స్ చేసారు. శ్రేయాఘోషల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. చాలామంది సుధామూర్తిని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. 1981లో ప్రారంభమయిన ఇన్ఫోసిస్ కంపెనీ ఇపుడు 100 బిలియన్ మార్కెట్ రేంజ్ లో ఉంది. సుధామూర్తి మంచి రచయిత కూడా. ఆమె పలు పుస్తకాలు, కధలను రాసారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

Exit mobile version