Subramanian Swamy: మోదీ, అమిత్ షాలపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తనపై కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సోమవారం ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 09:36 PM IST

New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తనపై కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సోమవారం ఆరోపించారు. మోదీ మరియు షా నాపై హరేన్ పాండేయా మాదిరి ప్లాన్ చేయరని నేను ఆశిస్తున్నానని స్వామి అన్నారు. మోదీ మరియు షా నా పై హరేన్ పాండేయా మాదిరి ప్లాన్ చేయరని నేను ఆశిస్తున్నాను. అలా అయితే, నేను నా స్నేహితులను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. నాకు చేతనయింత మంచి ఇస్తానని గుర్తుంచుకోండి. వీరిద్దరూ ఆర్‌ఎస్‌ఎస్‌లో అత్యున్నత స్దానంలో ఉన్నవారిని కూడా మభ్యపెట్టారంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేసారు.

హరేన్ పాండ్యా గతంలో గుజరాత్ హోం మంత్రి. 26 మార్చి 2003న, ఉదయం 7:40 గంటలకు, అహ్మదాబాద్‌లోని లా గార్డెన్స్‌లో తన మార్నింగ్ వాక్ ముగించుకుని వచ్చిన పాండ్య పై ఐదు బుల్లెట్లు కాల్చి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. అతని మృతదేహం అతని కారులో రెండు గంటలపాటు పడి ఉంది. పాండ్యా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు కావడంతో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరియు అప్పటి భారత ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ పై ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది.

2002 గోద్రా అల్లర్ల తర్వాత, కేబినెట్ మీటింగ్‌లో, బాధితుల మృతదేహాలను అహ్మదాబాద్‌కు తీసుకురావడాన్ని పాండ్యా వ్యతిరేకించారని తెలిసింది. అయితే ఈ సమావేశంలో కొందరు మంత్రులు ఆయనపై విరుచుకుపడినట్లు సమాచారం. శాంతి చర్చల కోసం బాధితుల కుటుంబ సభ్యులు మరియు ముస్లిం నేతల మధ్య సమావేశాలు ఆయన ఏర్పాటు చేసారు.