Site icon Prime9

Bihar Cm Nitish: సీఎం సార్ కోసం నిలిచిపోయిన రైళ్లు .. ఎక్కడో తెలుసా?

Nithish kumar

Nithish kumar

Bihar Cm Nitish:  బీహార్ సీఎం  నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం రెండురైళ్లను నిలిపివేయడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.

ఇది అధికార దుర్వినియోగమేనని ప్రతిపక్షనాయకులు అంటున్నారు.

సీఎం నితీష్ కుమార్ సమాధాన్ యాత్ర జనవరి 18న బక్సర్ కు చేరుకుంది.

సిఎం కాన్వాయ్ బక్సర్‌లోని ఇటాధి రైల్వే క్రాసింగ్‌ను దాటి జిల్లా అతిథి గృహానికి చేరుకోవడానికి

ఔటర్ సిగ్నల్ వద్ద 15 నిమిషాల పాటు రెండు ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి.

దీనితో పలువురు ప్రయాణికులు రైలు దిగి బక్సర్ రైల్వే స్టేషన్ వైపు నడిచారు.

దీనిపై రైల్వే సిబ్బంది మాట్లాడుతూ సీఎం కాన్వాయ్ వెళ్లినపుడు రైళ్లు ఆపివేయడం సాధారణమేనని అన్నారు.

అయితే ప్రయాణీకులు మాత్రం దీనిపై మండిపడుతున్నారు.

సమాధానం కోసం కాదు.. సమస్య సృష్టించేందుకు వచ్చారు.. కేంద్రమంత్రి అశ్విని చౌబే

సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం రైళ్లను నిలిపివేయడంపై కేంద్రమంత్రి అశ్వని బౌబే విమర్శలు గుప్పించారు.

నితీష్ ‘సమస్య’ సృష్టించేందుకు వచ్చారని, ‘సమాధానం’ కాదు. ‘సమస్య కుమార్ భాగో యహ సే!’ అంటూ వ్యాఖ్యానించారు.

రైల్వే మంత్రిత్వ శాఖ ను ఉన్నత స్థాయి విచారణ చేయమని అడుగుతానని అన్నారు.

ఇది అరాచకం..

మాజీ జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు అజయ్ అలోక్ కూడా సీఎం నితీష్ కుమార్ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు.

ఈ సంఘటనను ఆయన అరాచకంగా వర్ణించారు.

ఇప్పటివరకు ప్రధాని కాన్వాయ్‌, రాష్ట్రపతి కాన్వాయ్‌ కోసం కూడా రైలును ఆపలేదు.

అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం రైలును నిలిపివేస్తున్నారని విమర్శించారు.

రామచరిత్ మానస్ వివాదం..

రామచరిత్ మానస్ మనుస్మృతి వంటి “విభజనాత్మక గ్రంథం” అని బీహార్ విద్యా మంత్రి చంద్ర శేఖర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

దీనిపై చంద్ర శేఖర్‌కు తన అసంతృప్తిని తెలియజేసినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు.

అన్ని మతాల ప్రజలు – హిందువులు, ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు – వారు కోరుకున్నట్లు వారి మతాన్ని ఆచరించడానికి స్వేచ్ఛగా ఉండాలి.

ఏ స్థాయి నుండి జోక్యం ఉండకూడదని ఈ వివాదం గురించి తన అభిప్రాయాలను కోరినప్పుడు నితీష్ కుమార్ అన్నారు.

నేను ఇప్పటికే ఈ సమస్యపై అతనితో మాట్లాడాను. డిప్యూటీ సిఎం (తేజస్వి యాదవ్) కూడా తన అభిప్రాయాలను స్పష్టం చేశారని అన్నారు.

సమస్యను మరింత సాగదీయవద్దని నేను అందరినీ అభ్యర్థిస్తున్నానని అన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version