Site icon Prime9

INLD rally: భాజాపాయేతర ప్రధాన ఫ్రంట్ దిశగా అడుగులు పడాలి

Steps should be taken towards non-BJP main front

Steps should be taken towards non-BJP main front

Fatehabad: జాతీయ స్థాయిలో పార్టీని స్థాపించాలనుకొనే నేతలకు విపక్ష పార్టీలు చెక్ పెట్టాయి. భాజాపాయేతర ప్రభుత్వంగా ఏర్పడాలని, అందుకు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు కేరాఫ్ ప్రధాన ఫ్రంట్ ఒక్కటేనంటూ నేతలు పిలుపునిచ్చారు. మాజీ ఉపప్రధాని దేవీలాల్ 109వ జయంతి సందర్భంగా హర్యానాలోని ఫతేబాద్ లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నిర్వహించిన బహిరంగ సభలో ఎన్సీపి అధినేత శరద్ పవార్, బీహార్ సీఎం నితీష్ కుమార్, సీపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ బాదల్, ఆర్జేడి నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, శివసేన నేత అర్వింద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు.

శరద్ పవార్ సైతం విపక్ష పార్టీలన్నీ ఐక్యత సాధించాలని విజ్నప్తి చేశారు. 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాలంటే విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు. ఇటీవల రద్దు చేసిన మూడు సాగు చట్టాలతో సహా కేంద్ర ప్రభుత్వం ఎన్నో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించలేదని అన్నారు. ప్ర‌భుత్వ తీరుతో న‌ష్ట‌పోయిన కొంద‌రు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నితీష్ కుమార్ మాట్లాడుతూ, తాను ప్రధాని అభ్యర్థి రేసులో లేనని పేర్కొన్నారు. దేశంలో తృతీయ కూటమి ప్రసక్తే లేదని, బీజేపీని దెబ్బ తీసేందుకు విపక్షాలతో ప్రధాన ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో మనమంతా ఏకం కావాలన్నదే తన ఏకైక కోరికగా తెలిపారు. మరిన్ని పార్టీలను కూడా కలుపుకొని ఏకతాటిపైకి అందర్నీ తీసుకురావాలని అన్నారు.

తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ఎన్‌డీఏ ఉనికి కోల్పోయే పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. ఆ కూటమి భాగస్వాములుగా ఉన్న శివసేన, అకాలీదళ్, జేడీయూలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నాయని అన్నారు. తప్పుడు వాగ్దనాలు చేయడం, అబద్ధాలు చెప్పడంలో బీజేపీకి ఎవరూ సాటి లేరని విమర్శించారు.

సుఖ్ బీర్ బాదల్ మాట్లాడుతూ భావ సరూప్యం కలిగిన పార్టీలన్నీ కొత్త కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. శివసేన, జేడీయూ, తమ పార్టీ కలిసి ఏర్పాటు చేసిన కూటమే నిజమైన ఎన్డీయే అని ఆయన తెలిపారు. బీజేపీ బలహీన శక్తిగా, చిన్న పార్టీగా ఉన్నప్పుడు తాము ఈ కూటమి ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రైతులు, కష్ట జీవులతో పొత్తు పెట్టుకునే సమయం ఆసన్నమైందని అన్నారు.

ఇది కూడా చదవండి: జింఖానా గ్రౌండ్ లో గాయపడ్డవారికి ఉచిత మ్యాచ్ వీక్షణ

 

Exit mobile version