Prime9

Elon Musk : భారత్‌లోనూ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలు

Star Internet in India : ఇండియాలో స్టార్‌లింగ్ ఇంటర్నెట్ సేవలకు అనుమతి లభించింది. దేశంలో మూడో ఇంటర్నెట్ కంపెనీగా స్టార్‌లింగ్ ఏర్పాటు కాబోతోంది. విషయాన్ని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ స్టార్‌లింగ్ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది.

 

శాటిలైట్ టెక్నాలజీతో హైస్పీడ్, తక్కువ లేటెన్సీతో ఇంటర్నెట్ సర్వీసులను అందించనుంది. ఇప్పటికే తమ కస్టమర్లకు స్టార్‌లింక్ సేవలను అందించేందుకు దేశీయ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే స్టార్ లింగ్‌తో ఒప్పందం చేసుకున్నాయి. మారుమూల, కొండ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలందించేందుకు స్టార్‌లింక్ ఉపయోగపడుతుంది. సగటున 50 ఎంబీపీఎస్ నుంచి 150 ఎంబీపీఎస్ వేగంతో సేవలు లభిస్తాయి. స్పేస్‌ఎక్స్ అనుబంధ స్టార్‌లింక్ ఇప్పటికే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను 100 దేశాల్లో సేవలు అందిస్తోంది.

Exit mobile version
Skip to toolbar