Site icon Prime9

Special Train: 250 ప్రయాణికులతో చెన్నై బయలుదేరిన స్పెషల్ ట్రైన్

Special Train

Special Train

Special Train: ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో క్షేమంగా బయటపడిన ప్రయాణికుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నైకి పంపుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు నెంబర్‌ P/13671 భద్రక్‌ స్టేషన్ నుంచి బయల్దేరి.. బహనాగలో ప్రయాణికులను ఎక్కించుకుంటుంది. ఈ రాత్రి 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటుందన అధికారులు తెలిపారు.

విజయవాడ స్టేషన్ లో 9 మంది ప్రయాణికులు దిగుతారన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రహ్మపురలో నలుగురు ప్రయాణికులు దిగగా.. 41 మంది విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో ఒకరు, తాడేపల్లిగూడెంలో ఇద్దరు, చెన్నైలో 133 మంది ప్రయాణికులు దిగుతారని దక్షిణ మధ్య రైల్వే డివిజినల్‌ అధికారి తెలిపారు. ఆదివారం ఉదయానికి ఈ ప్రత్యేక రైలు చెన్నై చేరుకుంటుందన్నారు.

 

ఏపీ  చెందిన 178 మంది(Special Train)

మరో వైపు ప్రమాదానికి గురైన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారిలో 110 మంది విశాఖపట్నం స్టేషన్‌లో దిగాల్సి ఉంది. రాజమహేంద్రవరంలో 26 మంది, తాడేపల్లి గూడెంలో ఒకరు, ఏలూరులో ఇద్దరు, విజయవాడలో 39 మంది దిగాల్సి ఉంది.

వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశాలోని బాలేశ్వర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 278 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 900 మందికి పైగా క్షతగాత్రులైనట్లు అధికారులు తెలియజేశారు.

 

Exit mobile version