Parliament New Building: సెప్టెంబరు 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభమవుతాయి.సెప్టెంబర్ 19న, గణేష్ చతుర్థి సందర్భంగా, పార్లమెంటరీ కార్యకలాపాలు కొత్త పార్లమెంట్ భవనానికి మారనున్నాయని నివేదిక పేర్కొంది.
పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయం లేకుండానే జరుగుతాయని శనివారం లోక్‌సభ మరియు రాజ్యసభ సెక్రటేరియట్‌లు తెలిపాయి.సెషన్‌లో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయని, తాత్కాలిక క్యాలెండర్ గురించి సభ్యులకు విడివిడిగా తెలియజేస్తామని తెలిపాయి.సాధారణంగా ఒక సంవత్సరంలో మూడు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి.అవి బడ్జెట్, వర్షాకాలం మరియు శీతాకాల సమావేశాలు.
సెప్టెంబరు 18 నుండి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. దాని కోసం అజెండాను ప్రకటించక పోవడం ఊహాగానాలకు దారితీసింది.ఒక రోజు తర్వాత, ప్రభుత్వం జమిలి ఎన్నికలను పరిశీలించడానికి మరియు సిఫార్సు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనితో ప్రత్యేక సెషన్ ప్రస్తుత లోక్‌సభలో చివరిది కావచ్చు అనే ఊహాగానాలు బయలుదేరాయి.