Site icon Prime9

Sonia Gandhi: జోడోయాత్రలో రాహుల్ తో కలిసి నడిచిన సోనియాగాంధీ

JODOYATRA

JODOYATRA

Sonia Gandhi: రాహుల్ జోడో యాత్రకు కొత్త బూస్ట్‌ వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోన్న జోడోయాత్రలో సోనియా గాంధీ పాల్గొనడం కాంగ్రెస్‌ నేతల్లో కొత్త జోష్‌ నింపింది. కర్ణాటక మాండ్యాలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా సోనియా గాంధీ వచ్చారు. అక్టోబరు 3న కర్ణాటకు వచ్చిన సోనియా హెచ్‌డి కోటే తాలూకాలోని బీరాంబలిలోని ఆరెంజ్ కౌంటీ రిసార్ట్‌లో తన రాహుల్‌తో 2 రోజులు బస చేశారు.

ఆయుధపూజ, విజయదశమి పండుగల్లో భాగంగా రెండు రోజుల పండుగ విరామం తర్వాత ప్రారంభమయిన  నేటి జోడో యాత్రలో  పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. జక్కనహళ్లి క్రాస్ నుంచి పాండవపూర్ మహదేశ్వరాలయంలో పూజలు చేసిన.. రాహుల్ గాంధీ కర్ణాటకలో 5వ రోజు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ తన కుమారుడికి మద్దతుగా కలిసి నడవడంతో కార్యకర్తలు తెగ ఆనందపడిపోతున్నారు.

నేటి ఉదయం 11 గంటలకు పాదయాత్ర నాగమంగళ తాలూకాలోని చౌడేనహళ్లి గేట్‌లోకి ప్రవేశిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఖరాద్య గ్రామ సమీపంలో రైతులతో రాహుల్ గాంధీ సంభాషించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కొంత సేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత మళ్లీ ప్రారంభమయ్యే యాత్ర నాగమంగళ తాలూకాలోని పొట్‌హోసూరు గేటు వద్ద బస చేస్తారు.

Exit mobile version