Sonia Gandhi Discharged From Ganga Ram Hospital In Delhi: కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ మాజీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదర సంబంధిత వ్యాధితో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు ఆమెకు గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషలిస్టు డాక్టర్ సమీరన్ నందీ ట్రీట్ మెంట్ నిర్వహించారు. రాత్రి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అనంతరం కాసేపటి క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
Sonia Gandhi: ఆస్పత్రి నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ డిశ్చార్జి
