Site icon Prime9

Sonali Phogat Death: నటి సోనాలి ఫోగట్ కన్నుమూత

Goa: భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు మరియు నటి సోనాలి ఫోగట్ సోమవారం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఉత్తర గోవాలోని ఎస్టీ ఆంటోనీ ఆస్పత్రి నుంచి సోనాలి ఫోగట్ మృతి గురించి పోలీసులకు సమాచారం అందింది.

41 ఏళ్లసోనాలి ఫోగట్ పాపులర్ టిక్‌టాక్ స్టార్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అడంపూర్ స్థానం నుండి ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి మారిన కుల్దీప్ బిష్ణోయ్‌పై పోటీ చేశారు. ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ 14వ సీజన్‌లో కనిపించింది. 2016లో, సోనాలి ఫోగట్ భర్త సంజయ్ మరణించారు.

సోనాలి ఫోగట్ తన టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది. 2006లో టీవీ యాంకర్‌గా రంగప్రవేశం చేసిన ఆమె రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరింది. ఆమె 2016లో ‘అమ్మా: ఏక్ మా జో లఖోన్ కే లియే బని అమ్మ’ అనే టీవీ షోతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆమె 2019లో ‘ది స్టోరీ ఆఫ్ బద్మాష్‌గఢ్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా భాగమైంది.

Exit mobile version