Gold Smugglers: ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో, సముద్రంలో పడేసిన రూ.20.2 కోట్ల విలువైన 32 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సముద్ర మార్గంలో రామేశ్వరం మండపం ప్రాంతం గుండా బోటులో పెద్ద మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
రెండు రోజులపాటు గాలింపు..(Gold Smugglers)
రామేశ్వరం ద్వీపం సమీపంలో గుర్తు తెలియని పడవను నిలిపి ఉంచినట్లు కోస్ట్ గార్డ్ బృందం గుర్తించింది.అధికారులను చూసిన బోటులోని సిబ్బంది అకస్మాత్తుగా ఓ పార్శిల్‌ను సముద్రంలో పడేశారు. దీనితోబుధవారం సముద్రంలో పడేసిన వస్తువులను గుర్తించేందుకు స్థానిక మత్స్యకారులతో పాటు స్కూబా డైవర్ల బృందాన్ని రప్పించారు. రెండు రోజుల పాటు ఆపరేషన్లు కొనసాగాయి.సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పని సవాలుగా ఉంది, పార్శిల్‌ను కనుగొనే డైవింగ్ బృందానికి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ, ఆపరేషన్లు కొనసాగాయి. స్కూబా డైవర్లు చాలా గంటల ప్రయత్నాల తర్వాత పార్శిల్‌ను తిరిగి పొందగలిగారు.
ఆ పార్శిల్‌లో బంగారం విలువ సుమారు రూ. 20.2 కోట్లు ఉంటుందని, దాని బరువు 32.689 కిలోగ్రాములు ఉన్నట్లు సంబంధిత వర్గాలు నిర్ధారించాయి. ఈ బంగారాన్ని శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకువిచారణ జరుపుతున్నారు.