Site icon Prime9

Bihar : దలైలామాపై చైనా మహిళా గూఢచారి నిఘా.. ఊహాచిత్రం విడుదల

Dalailama

Dalailama

Bihar : ప్రస్తుతం బీహార్‌లోని బోధ్‌గయాలో ఉన్న ఆధ్యాత్మికవేత్త దలైలామాపై గూఢచర్యం చేసినట్లు అనుమానిస్తున్న మహిళ స్కెచ్‌ను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ఆమె పాస్‌పోర్ట్ మరియు వీసా వివరాలను మీడియాకు విడుదల చేసిన పోలీసులు ఆ మహిళను సాంగ్ జియోలాన్‌గా గుర్తించారు. సాధువు వేషంలో బోధ్ గయాకుఆమె వచ్చినట్టు చెబుతున్నారు. . కీలక ప్రాంతాల్లోని హోటల్స్‌ అన్నింట్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు. బోధ్ గయాలోని కాల్‌చక్ర మైదాన్‌లో దలైలామా నేతృత్వంలో ఓ కార్యక్రమం జరగనుంది. 50 దేశాలకు చెందిన 2 లక్షల మంది బౌద్ధ భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు

గయాలో ఒక చైనీస్ మహిళ నివసిస్తున్నట్లు ఇన్‌పుట్ వచ్చింది. గత 2 సంవత్సరాలుగా ఇన్‌పుట్‌లు పొందుతున్నాము. ప్రస్తుతం, చైనీస్ మహిళ ఆచూకీ లేదు. ఆమె చైనా గూఢచారని తోసిపుచ్చలేం అని ఎస్‌ఎస్పీ గయా హర్‌ప్రీత్ కౌర్ అన్నారు. కోవిడ్ – 19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత బౌద్ధ పర్యాటక పట్టణంలో తన వార్షిక పర్యటనను తిరిగి ప్రారంభించిన టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా గురువారం నాడు బోధ్ గయా చేరుకున్నారు. దలైలామా డిసెంబర్ 29 నుండి 31 వరకు కాలచక్ర మైదాన్‌లో ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.

మరోవైపు చైనా తదుపరి దలైలామాను ఎన్నుకునే యోచనలో ఉందన్న వార్త అలా బయటకు వచ్చిందో లేదో…వెంటనే బుద్ధ సంఘాలు తీవ్రంగా విమర్శలు మొదలు పెట్టాయి. దలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశాయి.

Exit mobile version