Site icon Prime9

Shiv Sena: ఎన్నికల సంఘానికి చేరిన శివసేన పార్టీ గుర్తు వివాదం

Shiv Sena party symbol

Shiv Sena party symbol

Shiv Sena: శివసేన పార్టీ గుర్తు వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. విల్లు-బాణం గుర్తును తమ వర్గానికే కేటాయించాలంటూ అటు ఉద్ధవ్‌ ఠాక్రే, ఇటు సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గీయులు పోరాడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఎన్నికల సంఘం వరకు చేరింది. తాజాగా గుర్తు కేటాయింపు పై అభిప్రాయం చెప్పాల్సిందిగా ఉద్ధవ్‌ను ఎన్నికల సంఘం కోరింది. శనివారంలోగా తన స్పందన తెలియజేయాలని సూచించింది. షిండే, ఆయన వర్గీయులు పార్టీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోయారు. అందువల్ల వారికి పార్టీ పేరు గానీ, పార్టీ గుర్తు గానీ అడిగే హక్కు లేదు అని ఎన్నికల సంఘానికి ఠాక్రే‌ తెలిపారు.

ఈసీ విధించిన గడువు కంటే ఒక రోజు ముందే తన అభిప్రాయాన్ని చెప్పారు. తూర్పు అంధేరి నియోజవర్గానికి ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా పార్టీ గుర్తు పై నిర్ణయం తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు విల్లు-బాణం తమకే కేటాయించాలని కోరింది. అయితే, దీన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాల పై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున షిండే వినతి పై తదుపరి చర్యలేమీ తీసుకోకూడదని ఠాక్రే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది.

అయితే దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శిందే వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి అనుమతిచ్చింది. ఠాక్రే, షిండే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. దీంతో ఈ అంశం ఇప్పుడు ఈసీ పరిధిలో ఉంది. ఇప్పుడు ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుంలే అనేది అందరిలో ఉత్కంఠంగా మారింది.

Exit mobile version