Shirdi Bandh: ప్రసిద్ద సాయిబాబా దేవస్థానం కొలువైన షిర్డీ లో నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు గ్రామస్థులు. మే 1 నుంచి ఈ బంద్ ఉండనుందని గ్రామస్థులు హెచ్చరించారు. సాయిబాబా ఆలయానికి భద్రతా దృష్ట్యా సీఐఎస్ఎఫ్ బలగాలను సాయి సంస్థాన్ ట్రస్ట్ , మహారాష్ట్ర పోలీసులు ప్రతిపాధించారు. అందులో భాగంగా సీఐఎస్ఎఫ్ భద్రతపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు.
ఆలయ పవిత్రత దెబ్బతింటుంది(Shirdi Bandh)
కాగా, ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది చూసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణ సెక్యూరిటీ ని మహారాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్నారు. ఆలయానికి ప్రతి రోజు బాంబు స్క్వాడ్ తనిఖీలతో పాటు ఇతర సెక్యూరిటీ తనిఖీలు చేస్తారు. అయితే 2018లో సామాజిక కార్యకర్త సంజయ్ కాలే బాంబే హైకోర్టులో ఆలయ భద్రతపై ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఔరంగాబాద్ బెంచ్ సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ అంగీకరించింది.
అయితే ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఎయిర్ పోర్టులు, మెట్రో స్టేషన్లు, పరిశ్రమల భద్రతను చూసుకునే సీఐఎస్ఎఫ్‌కు ఆలయ భద్రతకు అవసరమైన శిక్షణ కానీ, సదుపాయాలు కానీ లేవనేవి గ్రామస్థులు వాదన. దీంతో ఆలయ పవిత్రత దెబ్బతింటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో షిర్డీలో అఖిల పక్ష నాయకులు, గ్రామస్థుల సమావేశమై మహారాష్ట్ర దినోత్సవం అయిన మే 1 నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. తర్వాతి కార్యచరణ కూడా అదే రోజు వెళ్లడిస్తామని పేర్కొన్నారు.
గ్రామస్థుల చేస్తున్న డిమాండ్లు
సాయిబాబా మందిరానికి సీఐఎస్‌ఎఫ్ భద్రతను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలి. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టరు, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలనేది మరో డిమాండ్ .
షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలి. ఇందులో 50 శాతం ధర్మకర్తలు స్థానికులు అయి ఉండాలి.
తాత్కాలిక కమిటీల వల్ల సంస్థాన్ పనులు ముందుకు సాగడంలేదు. అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి.
ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయి కమిటీ వేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.
ఆలయం తెరిచే ఉంటుంది(Shirdi Bandh)
మే 1 నుంచి గ్రామస్థులు బంద్ చేపట్టినా షిర్డీకి వచ్చే భక్తుల కోసం సాయిబాబా ఆలయం తెరిచే ఉండనుంది. సాయిబాబా సంస్థాన్‌లో భక్తులు బస చేయొచ్చు. సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్ లు యథావిధిగా కొనసాగుతాయి. భక్తుల కోసం సాయిబాబా సంస్థాన్‌లోని అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడినప్పటికీ ఆలయానికి సంబంధించిన వసతులన్నీ భక్తులకు అందుబాటులో