Sharad Pawar Resignation withdrawal: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. మద్దతుదారులు, ఓటర్లు చాలా సంవత్సరాలుగా తనవెంట ఉన్నారని, వారి మనోభావాలను విరుద్ధంగా వ్యవహరించలేనన్నారు. తనపై ఉన్న ప్రేమ, నమ్మకానికి తాను కదిలిపోయానని, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శరద్ పవార్ ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కమిటీని వేశారు. సమీప భవిష్యత్‌లో కొత్త తరం విజయవంతం అయ్యేందుకు పార్టీకి సంస్థాగత మార్పులను సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజీనామాను తిరస్కరించడంతో పాటు పార్టీ మనోభావాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్‌లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కమిటీ సమావేశం ఓవైపు జరుగుతుండగానే.. మరో వైపు కార్యకర్తలు రాజీనామాను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.
అజిత్ పవార్ గైర్హాజరు..(Sharad Pawar Resignation withdrawal)
అయితే ప్రెస్ మీట్‌కు మేనల్లుడు అజిత్ పవార్ గైర్హాజరు కావడంపై ప్రశ్నలు తలెత్తాయి. ఇదేంటని పవార్ ని ప్రశ్నించగా అందరూ ఒక్క విలేకరుల సమావేశంలో ఉండలేరు.. కొందరు ఇక్కడ ఉన్నారు.. మరికొందరు లేరు.. అయితే ఈరోజు ఉదయం పార్టీ సీనియర్ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి నిర్ణయం తీసుకున్నారు. అది నాకు తెలుసుఆ నిర్ణయం ద్వారా ప్రతి ఒక్కరూ తమ మనోభావాలను వ్యక్తం చేశారు. కాబట్టి, ఇక్కడ ఎవరు ఉన్నారు మరియు ఎవరు లేరు అనే ప్రశ్నను లేవనెత్తడం లేదా దీని అర్థం కోసం వెతకడం సరైనది కాదని అన్నారు.ఇతరులు ఇక్కడ ఉన్నారు. కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది మరియు వారి నిర్ణయం తర్వాత, నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. అందరూ ఏకమై దీనిపై చర్చించారు. సీనియర్ నాయకులు కమిటీలో ఉన్నారు.