West Bengal Governor:మన దేశంలో రాజభవన్‌లు గవర్నర్ల కామ క్రీడలకు వేదికలుగా మారాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన ఎన్‌డీ తివారి ఉదంతం అందరికి తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బెంగాల్ రాజ్‌భవన్‌లో పనిచేసే ఇద్దరు మహిళా ఉద్యోగులు గవర్నర్ తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బాధిత మహిళలకు జరిగిన దారుణాలున్న విన్న తర్వాత గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌కు రాష్ర్టంలోని మహిళల గురించి మాట్లాడే హక్కులేదన్నారు మమత దీదీ.
ముఖ్యమంత్రి మమత బెనర్జీ పుర్బ బర్దమాన్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. సందేశ్‌ఖాలిలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి బీజేపీ రాష్ర్టప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. మరి ఇప్పుడు రాజ్‌భవన్‌లో గవర్నర్ కామ కలాపాల గురించి ఎందుకు నోరు మెదపరని నిలదీశారు. రాజ్‌భవన్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులను గవర్నర్ ఆనందా బోస్ లైంగిక దాడులకు పాల్పడితే బీజేపీ స్పందించాలి కదా అని ప్రశ్నించారు. పనిలో పనిగా ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్‌సీ స్కాంలో ఉద్యోగులు కోల్పోయిన వారికి సాయం చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఆ ఉద్యోగాలు కోల్పోవడానికి బీజేపీ కారణమా అని ప్రశ్నించారు.
ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 2వ తేదీన రాజ్‌భవన్‌లో పనిచేసే ఇద్దరు మహిళా సిబ్బంది .. గవర్నర్ బోస్ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్‌భవన్‌కు రావడానికి రెండు గంటల ముదు జరిగింది. ఈ వివాదం ముదిరి పాకానపడే సరికి గవర్నర్ బోస్ కూడా స్పందించారు. నిజమే గెలుస్తుందన్నారు. తనపై జరుగుతున్న కుట్రలకు భయపడే ప్రసక్తిలేదన్నారు బోస్. తన వెనుక భారీ కుట్ర జరుగుతోందన్న సమాచారం తనకు తెలసిందన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసు…. పశ్చిమ బెంగాల్‌లో 1943లో జరిగిన కరువుకు కూడా తానే కారణమంటే ఆశ్చర్యపోను… 1946 జరిగిన హత్యలకు కూడా తానే బాధ్యుడి అన్నా తాను ఆశ్చర్యపోనన్నారు. రాష్ర్టంలో రాజకీయ పార్టీలు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతుంటాయన్నారు. తాను బెంగాల్‌కు విశ్రాంతి లేదా రిలాక్స్ కావడానికి రాలేదన్నారు బోస్. ఇక్కడి వాస్తవాలు తెలుసు… బెంగాల్‌లోతనకు అప్పగించిన బాధ్యత అత్యంత కఠినమైందని తెలుసు.. ఆ కొండను ఎక్కుతున్నాను. ప్రజలు తన పట్ల చూపిస్తున్నప్రేమ అభిమానం తనను ముందుకు నడిపిస్తోందన్నారు బోస్. మరి బోస్ పై వచ్చిన ఆరోపణలపై ప్రధాని, అమిత్ షా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.