Site icon Prime9

Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: దక్షిణ తమిళనాడు అంతటా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో పలు ప్రాంతాల్లో ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. పలు చోట్లచెట్లు కూలిపోయి కొండచరియలు విరిగిపడి రవాణా సదుపాయాలు స్తంభించిపోయాయి.

విరుదునగర్, మదురై మరియు తేని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు. తూత్తుకుడి, దిండిగల్, కన్నియాకుమారి, కోయంబత్తూర్, తిరుపూర్ మరియు శివగంగైలలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది.తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాసి, కన్నియాకుమారి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో తిరునల్వేలిలోని మణిముత్తర్ డ్యాం నుంచి 10,000 క్యూబిక్ అడుగుల నీటిని విడుదల చేసారు. తిరుపూర్‌లో, అమరావతి డ్యాంలో సెకనుకు 10,000 క్యూబిక్ అడుగుల నీటిమట్టం పెరగడంతో అమరావతి నది ఒడ్డున నివసించే ప్రజలకు వరద హెచ్చరిక జారీ చేయబడింది.నీరు ఇళ్లలోకి ప్రవేశించడం, కొండచరియలు విరిగిపడడం వల్ల కుముళి, కంపమ్మెట్టు, తేనిలోని పొడిమెట్టు వంటి చోట్ల రవాణా స్తంభించింది. ఒట్టపిడారం సమీపంలోని మదురైకి వెళ్లే లింక్ రోడ్డు పూర్తిగా తెగిపోయింది. పజయారు నది ఉధృతంగా ప్రవహించడంతో కన్యాకుమారి జిల్లా ఒజుగినచేరి వద్ద నీటిమట్టం 4 అడుగులకు చేరడంతో వరి పొలాలు నీట మునిగాయి.నాగర్‌కోయిల్‌లోని మీనాక్షి గార్డెన్ మరియు రైల్వే కాలనీ వంటి రెసిడెన్షియల్ కాలనీలు భారీ వరదలకు గురయ్యాయి.

తూత్తుకుడి జిల్లాలో 50 సెంటీమీటర్ల వర్షపాతం..(Tamil Nadu)

తూత్తుకుడి జిల్లాలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా తెలిపారు. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో జలమయమయ్యాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది.వరదనీటిలో రైలు పట్టాలు మునిగి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి వివిధ మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరునెల్వేలి వైపు వెళ్లే రైళ్లు సత్తూరు, విరుదునగర్, కోవిల్‌పట్టితో సహా పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి కొన్ని రైళ్లను పాక్షికంగా నిలిపివేయగా మరికొన్ని రైళ్లు దారి మళ్లించబడ్డాయి.తూత్తుకుడి మరియు సమీప పట్టణాలైన శ్రీవైకుండం మరియు కాయల్‌పట్టినం వంటి ప్రాంతాలకు అదనపు పడవలను పంపి ప్రజలను తరలిస్తున్నారు. ఇప్పటికే 7,500 మందిని తరలించి 84 సహాయ శిబిరాల్లో ఉంచారు. కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా 62 లక్షల మందికి తుఫాను హెచ్చరికలు పంపబడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్ మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ మరియు పోలీసు బృందాలు భారీగా ముంపునకు గురైన ప్రాంతాల నుండి ప్రజలను ఖాళీ చేయించి పాఠశాలలు మరియు కళ్యాణ మండపాలలో ఉంచారు.

తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాసి, కన్నియాకుమారి సహా జిల్లాల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించారు. ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

 

 

 

Exit mobile version