Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలకు.. నక్సలైట్లకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. నారాయణపూర్ -బీజూపూర్ జిల్లాల సరిహద్దులో గల అటవీ ప్రాంతంలో గురువారం నాడు భద్రతా దళాలకు .. నక్సలైట్లకు మధ్య ఎదుర కాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారని పోలీసులు తెలిపారు. కాగా భద్రతా దళాలు నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక టీంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగించారు. ఇప్పటికి ఆపరేషన్ కొనసాగుతోంది. నారాయణపూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రభాత్‌కుమార్ చెప్పారు.
మావోయిస్టు యూనిఫాంలో ఉన్న ఏడుగురు నక్సలైట్లు భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు మృతి చెందారని ఎస్‌పీ తెలిపారు. ఇక ఈ ఆపరేషన్‌లో దంతేవాడకు, నారాయణపూర్, బస్తర్ జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్‌లు, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్.. రాష్ర్టపోలీసులకు చెందిన అన్నీ యూనిట్లు కలిసి భారీ ఎత్తున ఆపరేషన్ చేపట్టాయి. ఇంద్రావతి ఏరియా కమిటి, ప్లాటూన్ నం 16 తచ్చాడుతున్నరన్న పక్కా సమాచారంలో అడవిలోకి ప్రవేశించామని ఎస్‌పీ వివరించారు.
ఇప్పటివరకు 112 మంది నక్సల్స్ మృతి..(Chhattisgarh Encounter)
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఏడు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తాజా ఎన్‌కౌంటర్‌తో కలుపుకొని ఈ ఏడాది ఇప్పటి వరకు 112 మంది నక్సల్స్ చనిపోయారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 30 నారాయణపూర్ -కాంకేర్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది నక్సల్స్ చనిపోగా వారిలో ముగ్గురు మహిళలున్నారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 16న కాంకేర్‌జిల్లాలో నక్సల్స్ – భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 29 మంది, మే 10న బిజాపూర్ జిల్లలోని పైడియా గ్రామంలో 12 మంది నక్సల్స్ మృతి చెందారని పోలీసులు చెప్పారు. అయితే స్థానిక గ్రామస్తులు, నక్సల్స్ సానుభూతి పరులు మాత్రం పైడియా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని నక్సలైట్లను ఎక్కడో చంపేసి వారిని ఇక్కడ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు కలరింగ్ ఇచ్చారని చెప్పారు.