Seema Haider: తన భారతీయ ప్రేమికుడితో కలిసి ఉండటానికి సరిహద్దులు దాటిన పాకిస్థానీకి చెందిన సీమా హైదర్‌కు రాజ్ ఠాక్రే యొక్క మహారాష్ట్ర నవనిర్మాణ సేన ( ఎంఎన్ఎస్) పార్టీకి చెందిన ఒక నాయకుడువార్నింగ్ ఇచ్చారు. సీమా హైదర్ కధను తెరకెక్కించడాన్ని ఆపాలని లేకపోతే తీవ్ర పరిణాములు ఉంటాయని హెచ్చరించారు.
పాకిస్థాన్ పౌరులకు స్థానం లేదు..(Seema Haider)
సీమా హైదర్ ప్రేమాయణంపై నోయిడాలోని చిత్ర నిర్మాత అమిత్ జానీ కరాచీ టు నోయిడా చిత్రాన్ని ప్రారంభించారు. సీమా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లో ఉంది.అయితే ఇటువంటి డ్రామాలు ఆపాలంటూ ఎంఎన్ఎస్ నేత అమేయ ఖోస్కర్ హెచ్చరించారు. భారత చలనచిత్ర పరిశ్రమలో పాకిస్థాన్ పౌరులకు స్థానం లేదు. ఈ వైఖరిపై మేము గట్టిగా నిలబడతాం. సీమా హైదర్ అనే పాకిస్థానీ మహిళ ప్రస్తుతం భారత్‌లో ఉంది. ఆమె ఐఎస్ఐ ఏజెంట్ అని కూడా పుకార్లు వచ్చాయి. మన పరిశ్రమలో కొంత నశ్వరమైన కీర్తి కోసం, వారు సీమా హైదర్‌ని నటిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దేశద్రోహ నిర్మాతలు సిగ్గుపడకుండా ఎలా ఉంటారు? తక్షణమే దీనికి ముగింపు పలకండి లేదా తగిన చర్యకు సిద్ధంగా ఉండండి అని అమేయ ఖోప్కర్ మరాఠీలో ట్వీట్ చేశారు.
జూలై 4న, సీమా భారతదేశంలోకి చొరబడినందుకు అరెస్టు చేయబడింది. ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైనప్పటికీ, ఈ జంటను దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.