Site icon Prime9

Samir V Kamat: డిఆర్‌డిఓ చీఫ్‌గా సమీర్ వి కామత్‌

New Delhi: డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) చైర్మన్‌గా సమీర్ వి కామత్‌ను నియమించారు. డిఆర్‌డిఓలో నావల్ సిస్టమ్స్ & మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కామత్, జి సతీష్ రెడ్డి స్థానంలో నియమితులయ్యారు.

డిఆర్‌డిఓ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి విభాగం. కామత్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా మరియు డిఆర్‌డిఓ ఛైర్మన్‌గా నియమించడానికి క్యాబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి) ఆమోదం తెలిపింది.

రెడ్డిని రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్‌గా నియమించేందుకు కూడా ఏసీసీ ఆమోదం తెలిపింది. రెడ్డి డిఆర్‌డిఓ చీఫ్‌గా 2018 ఆగస్టులో రెండేళ్ల పాటు నియమితులయ్యారు. ఆగస్టు 2020లో ఆయనకు పదవిలో రెండేళ్లు పొడిగింపు ఇవ్వబడింది.

Exit mobile version