Sakshi Malik: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు కొనసాగిస్తున్న నిరసన నుంచి సాక్షి మాలిక్ విరమించుకున్నారు. ఆమె ఉత్తర రైల్వేలో తన ఉద్యోగంలో తిరిగి చేరింది. రెజ్లర్లు శనివారం సాయంత్రం హోంమంత్రి అమిత్ షాను కలిసిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
శనివారం ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో రెజ్లర్ల సమావేశం అర్థరాత్రి వరకు జరిగింది. అయితే సాక్షి మాలిక్ భర్త సత్యవ్రత్ కడియన్, శనివారం హోం మంత్రి అమిత్ షాతో జరిగిన రెజ్లర్ల సమావేశం అసంపూర్తిగా ఉందని, ఎందుకంటేహోం మంత్రి నుండి వారు కోరుకున్న స్పందన రాలేదని అన్నారు.నిరసన తెలిపిన రెజ్లర్లు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు హరిద్వార్‌కు వెళ్లిన కొద్దిరోజుల తర్వాత హోంమంత్రితో సమావేశం జరిగింది.
మరోవైపు కాంగ్రెస్ నేత మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబల్ రెజ్లర్లపై కేంద్రప్రభుత్వ వైఖరిని తప్పు బట్టారు. బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ చార్జిషీటు దాఖలు చేయబడుతుంది. అయితే బెయిల్ మంజూరు అవుతుంది. విషయం న్యాయపరిధిలో ఉందని ప్రభుత్వం చెబుతుందంటూ ఆయన ట్వీట్ చేసారు.
లా ఉండగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన నుండి తాను విరమించుకున్నట్లు పేర్కొంటూ సోమవారం మీడియా కథనాలపై సాక్షి మాలిక్ స్పందించారు. న్యాయం కోసం పోరాటం’ కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారు.తాను నిరసనల్లో పాల్గొంటూనే ఉంటానని మాలిక్ స్పష్టం చేశారు. రెజ్లర్ల నిరసన నుండి తాను ఉపసంహరించుకున్నట్లు వచ్చిన వార్తలను ఆమె తిరస్కరించారు.
ఈ వార్తలు పూర్తిగా తప్పు. న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేమేమీ వెనక్కు తగ్గలేదు, వెనక్కు తగ్గలేదు. సత్యాగ్రహంతో పాటు రైల్వేలో నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అంటూ సాక్షి మాలిక్ ట్వీట్ చేసారు.