Site icon Prime9

coal smuggling: రూ. 800 కోట్ల బొగ్గు స్మగ్లింగ్ రాకెట్ ను చేధించిన రాజస్థాన్ పోలీసులు

coal smuggling

coal smuggling

coal smuggling: రాజస్థాన్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బుధవారం కనీసం రూ. 800 కోట్ల బొగ్గు చోరీకి పాల్పడిన వ్యవస్థీకృత రాకెట్‌ను ఛేదించింది.ఈ ముఠా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అధిక క్యాలరీ విలువ కలిగిన బొగ్గు స్థానంలో నాణ్యమైన బొగ్గును ఉపయోగించేదని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) దినేష్ తెలిపారు.

హైవేల వద్ద సరుకుని దించి..(coal smuggling)

రష్యా, ఇండోనేషియా, యుఎస్ మరియు ఇతర విదేశాల నుండి దిగుమతి చేసుకున్న అధిక కెలోరిఫిక్ విలువ గల బొగ్గు గుజరాత్‌లోని కాండ్లా మరియు గాంధీధామ్ ఓడరేవులకు దిగుమతి చేయబడింది. అక్కడి నుండి, అధిక కేలరీల విలువ కలిగిన బొగ్గుతో కూడిన ట్రక్కులు జలోర్, సిరోహి, జోధ్‌పూర్, బికనీర్ మరియు బార్మర్ మీదుగా ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ కంపెనీలకు చేరుకునేవి.మార్గమధ్యంలో నిందితులు ట్రక్ డ్రైవర్‌తో కలిసి హైవేల వద్ద నిర్మించిన షెడ్ల వద్ద వాహనాలను నిలిపివేసి ఈబొగ్గును దింపేవారని తెలిపారు. అక్కడ తూకం అలాగే ఉండేలా కనీసం రూ.2 లక్షల విలువైన తక్కువ నాణ్యమైన బొగ్గుతో భర్తీ చేసేవారని చెప్పారు.

రోజుకు రూ. 2 కోట్లు సంపాదన..

సగటున, ఈ ఆరు జిల్లాల హైవేల గుండా 150 ట్రక్కులు వెళుతున్నాయి. మేము 13 ప్రదేశాలపై దాడి చేసాము. ఒక్కో ట్రక్కు నుండి, వారు రూ. 2 లక్షల విలువైన స్టాక్‌ను మార్చేవారు. అంటే వారు ప్రతిరోజూ కనీసం రూ. 2 కోట్లు సంపాదించారు. ఇది కనిష్టం. ఇంకా ఎక్కువ స్టాక్‌ను మార్చినట్లు మేము అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ కుంభకోణాకి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ డజనుకు పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.ఈ అధిక నాణ్యత గల బొగ్గును కొనుగోలు చేసిన వారు ఎవరు అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ జరుగుతోంది.

Exit mobile version