Chhattisgarh liquor scam: చత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ స్కామ్ లొ 2,000 కోట్ల విలువైన మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు మరియు బ్యూరోక్రాట్ల “మద్దతు”తో ఇది జరుగుతోందని ఈడీ పేర్కొంది. 2019 మరియు 2022 మధ్యకాలంలో 2,000 కోట్ల రూపాయల మేరకు అవినీతి మరియు మనీలాండరింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపింది.
మద్యం వ్యాపారాన్ని నియంత్రించిన అన్వర్ ధేబర్..(Chhattisgarh liquor scam)
ఛత్తీస్‌గఢ్‌లో అన్వర్ ధేబర్ నేతృత్వంలోని వ్యవస్థీకృత క్రిమినల్ సిండికేట్ పనిచేస్తోందని ఈడీవిచారణలో వెల్లడైంది. అన్వర్ ధేబర్,ఉన్నత స్థాయి రాజకీయ అధికారులు మరియు సీనియర్ బ్యూరోక్రాట్‌ల తరపున పనిచేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో విక్రయించే ప్రతి మద్యం సీసా నుండి అక్రమంగా డబ్బు వసూలు చేసేలా అతనుకుట్రను రూపొందించాడు. ఈ కుంభకోణాన్ని అమలు చేయడానికి వ్యక్తులు లేదా సంస్థల యొక్క విస్తృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసాడు. ఈ కేసులో ముందుగా మార్చిలో దాడులు జరిగాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈడీ దర్యాప్తు మే 2022లో దాఖలు చేసిన ఆదాయపు పన్ను శాఖ ఛార్జ్ షీట్ ఆధారంగా జరిగింది. శనివారం నాడు కోర్టు ముందు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ (మద్యం) సిండికేట్‌కు అన్వర్ ధేబర్ ప్రధాన కలెక్షన్ ఏజెంట్.. ఛత్తీస్‌గఢ్‌లో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పరిపాలనను పూర్తిగా హైజాక్ చేసాడని ఈడీ పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వినియోగదారునికి సేకరణ నుండి రిటైల్ అమ్మకం వరకు మద్యం వ్యాపారం యొక్క అన్ని అంశాలను నియంత్రిస్తుంది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతి లేదు. మొత్తం 800 మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) ఛత్తీస్‌గఢ్‌లో విక్రయించే మద్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుంది.ప్రైవేట్ డిస్టిల్లర్లు, ఎఫ్‌ఎల్-10ఎ లైసెన్స్ హోల్డర్లు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు, జిల్లా స్థాయి ఎక్సైజ్ అధికారులు, మ్యాన్‌పవర్ సప్లయర్లు, గ్లాస్ బాటిల్ తయారీదారులు, హోలోగ్రామ్ మేకర్స్, క్యాష్ కలెక్షన్ వెండర్ మొదలైన వారి నుండి మొదలయ్యే మద్యం వ్యాపారం యొక్క మొత్తం గొలుసును అన్వర్ ధేబర్ నియంత్రించాడు మరియు దానిని ప్రభావితం చేశాడు. ఈ ప్రక్రియలో అనేక ఇతర వాటాదారులు కూడా చట్టవిరుద్ధంగా ప్రయోజనం పొందారు.
మూడేళ్లలో రెండువేల కోట్ల ఆదాయం..
2019 మరియు 2022 మధ్య, రాష్ట్రంలో జరిగిన మొత్తం మద్యం అమ్మకాలలో దాదాపు 30-40% ఈ రకమైన అక్రమ విక్రయాలు రూ.1,200 నుండి రూ.1,500 కోట్ల అక్రమ లాభాలను ఆర్జించాయని ఈడీ విచారణ వెల్లడించింది.2019 నుండి 2022 వరకు తక్కువ వ్యవధిలో సిండికేట్ ద్వారా రూ.2,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఈడీ అంచనావేసింది.అంతకుముందు మార్చిలో అన్వర్ ధేబర్ నివాస ప్రాంగణాలతో సహా ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ మరియు ఢిల్లీలోని 35 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.