Site icon Prime9

Drugs seized: కేరళ తీరంలో రూ. 15,000 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Drugs seized

Drugs seized

Drugs seized: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( ఎన్ సి ఆర్ బి), భారత నావికాదళం సంయుక్తంగా జరిపిన దాడిలో శనివారం కేరళ తీరంలో రూ. 15,000 కోట్ల విలువైన 2,500 కిలోల మెథాంఫేటమిన్‌ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్బంగా పాకిస్థాన్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి సాగుతున్న సముద్ర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను లక్ష్యంగా చేసుకున్న ‘ఆపరేషన్ సముద్రగుప్త్’లో భాగంగా ఈ దాడి జరిగింది.మాదకద్రవ్యాలను తీసుకెళ్తున్న షిప్ ను ఎన్ సి ఆర్ బి అడ్డుకోవడం ఇదే మొదటిసారి.

పాకిస్తాన్ కు చెందినదే..(Drugs seized)

ఎన్‌సిబి మరియు ఇండియన్ నేవీ సంయుక్త ఆపరేషన్‌లో కేరళ తీరంలో 2,500 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. . మాదకద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు రూ. 15,000 కోట్లు. ఈ సరుకు భారత జలాల్లో పట్టుబడింది; అది శ్రీలంక వైపు వెళుతోంది. మొత్తం మూడు పడవలు పట్టుబడ్డాయి. రెండు తప్పించుకోగలిగాయని ఎన్ సి ఆర్ బి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ చెప్పారు.ఈ పడవ పాకిస్థాన్‌కు చెందినదిగా ఎన్‌సీఆర్ బీ అనుమానిస్తోంది. గత ఏడాదిన్నర కాలంలో దక్షిణ మార్గంలో నమోదైన మూడో అతిపెద్ద సీజ్ అని అధికారులు తెలిపారు.

మక్రాన్ తీరం నుండి భారీ మొత్తంలో మెథాంఫేటమిన్‌ను మోసుకెళ్తున్న ఓడ కదలిక గురించి ఎన్ సి ఆర్ బి మరియు నేవీ యొక్క ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను నౌకాదళంతో పంచుకోవడంతో అది సమీపంలో ఓడను మోహరించింది.ఈ ఇన్‌పుట్‌ల ఆధారంగా నావికాదళం సముద్రంలో వెళుతున్న ఒక పెద్ద నౌకను అడ్డగించి 134 బస్తాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. అన్ని ప్యాకెట్లలో మెథాంఫేటమిన్ ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.

‘ఆపరేషన్ సముద్రగుప్త్’ అంటే ఏమిటి?..

హిందూ మహాసముద్ర ప్రాంతంలో హెరాయిన్ మరియు ఇతర మాదకద్రవ్యాల సముద్ర మాదకద్రవ్యాల రవాణా నుండి జాతీయ భద్రతకు ముప్పు ఉన్న దృష్ట్యా ఎన్ సి ఆర్ బి డైరెక్టర్ జనరల్ జనవరి 2022లో ఆపరేషన్ సముద్రగుప్త్‌ను ప్రారంభించారు. నిషిద్ధ వస్తువులను మోసుకెళ్లే నౌకలను గుర్తించడం, వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యాలు.

Exit mobile version
Skip to toolbar