Site icon Prime9

Oscar Awards : పార్లమెంటులో ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలకు అరుదైన గౌరవం..

rrr and the elephant whisperers got appreciation from parliament

rrr and the elephant whisperers got appreciation from parliament

Oscar Awards : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రి అంతా గర్వంగా విశ్వ వేదికపై తలెత్తుకునేలా చేశాయి మన చిత్రాలు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాట పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం దేశ ప్రజల విజయంగా భావిస్తున్నారు. బెస్ట్‌ ఒరిజినల్ క్యాటగిరీలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్‌ వేదిక దద్దరిల్లిన విషయం తెలిసిందే. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రాలకు దేశ ప్రజలంతా అభినందనలు తెలుపుతూ ప్రశంసలు తెలుపుతున్నారు.  ఇదిలా ఉంటే పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంట్ సమావేశాల్లోనూ ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలకు గౌరవం దక్కింది. ఈ చిత్రాలకు రాజ్యసభలోనూ ప్రశంసలు వెల్లువెత్తాయి. రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్ ధన్‌ఖర్ ట్రిపులార్‌ చిత్ర యూనిట్‌ను అభినందించారు.. ఆయన నాటు నాటు అంటూ మొదలు పెట్టగానే సభలో ఉన్న సభ్యుల చప్పట్లతో సభ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఈ విజయాలు భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత అంకితభావాని తెలియజేస్తాయన్నారు. నిజానికి ఇది మన గ్లోబల్‌ గుర్తింపు అంటూ ప్రశంసించారు.

మోదీ ఇవి(Oscar Awards) మీ ఖాతాలో మాత్రం వేసుకోకండి..

భారత దేశానికి రెండు ఆస్కార్‌ అవార్డులు దక్కడంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున్‌ ఖర్గే స్పందించారు. ట్రిపులార్‌తో పాటు, ది ఎలిఫెంట్ విస్పర్స్ చిత్రయూనిట్స్‌కి ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సందర్భంలో ప్రధాని మోదీకి తనదైన శైలిలో చురకలు అంటించారు ఖర్గే. ఆస్కార్‌ విజయాలను మోదీ గారు తమ ఖాతాలో వేసుకోకండి అంటూ చమత్కరించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version