Site icon Prime9

RPF Constable Fired: ముంబై-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్‌ఐతో సహా నలుగురు మృతి

RPF Constable

RPF Constable

RPF Constable Fired: జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న నలుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవాన్ కాల్చిచంపాడు. బాధితుల్లో ముగ్గురు ప్రయాణికులు, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) ఉన్నారు.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ నలుగురిని కాల్చిచంపాడు. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వాపి-బొరివలి స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది.

మూడుచోట్ల కాల్పులు..(RPF Constable Fired)

కానిస్టేబుల్ చేతన్ రైలులో మూడు చోట్ల కాల్పులు జరిపాడు. B5 కోచ్ లో ఇద్దరు, ప్యాంట్రీలో ఒకరు , S6 కోచ్‌లో ఒకరు కాల్చి చంపబడ్డారు. అతను ఉదయం 6 గంటల తర్వాత తన ఆటోమేటిక్ వెపన్ నుండి కాల్పులు జరిపాడు, ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎస్కార్టింగ్ డ్యూటీలో ఉన్న ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడని మాకు తెలిసింది… నలుగురు వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. మా రైల్వే అధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబాలను సంప్రదించారు. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి అని డీఆర్‌ఎం నీరజ్‌కుమార్‌ తెలిపారు.

కానిస్టేబుల్ చేతన్ కుమార్ చౌదరి తన ఎస్కార్ట్ డ్యూటీ ఇంచార్జి ఏఎస్సై టికారామ్ మీనాపై కాల్పులు జరిపినట్లు అతను ధృవీకరించారు. తన సీనియర్‌ని చంపిన తర్వాత, కానిస్టేబుల్ మరో బోగీకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడని అధికారి తెలిపారు. మృతుల్లో ఒకరు బీహార్‌కు చెందిన అస్గర్‌గా గుర్తించారు.ఘటన తర్వాత నిందితుడు దహిసర్ స్టేషన్‌లో ఎమర్జెన్సీ చైన్‌ను లాగి రైలు నుంచి కిందకు దిగిపోయాడు, అయితే, అతన్ని ముంబై రైల్వే పోలీసులు భయందర్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని లోయర్ పరేల్ వర్క్‌షాప్‌లో ఉంచారు.కాల్పుల వెనుక కారణం ఇంకా తెలియరాలేదు, రైల్వే పోలీస్ కమిషనర్ మరియు సీనియర్ అధికారులు బోరివలి జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విచారిస్తున్నారు.

Exit mobile version