Lalu Prasad Yadav Suspended his Son Tej Pratap from RJD: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం నెలకొంది. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ యాదవ్ ను బహిష్కరించారు. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజకీయ పార్టీ నుంచే కాక, తన కుటుంబం నుంచి కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ ను వెలేస్తున్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
కాగా తాను అనుష్క యాదవ్ అనే యువతితో 12 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నానని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించిన ఒక్కరోజులోనే లాలూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తేజ్ తన వ్యక్తిగత జీవితంలో విలువలను మరిచిపోయి బాధ్యతారాహిత్యంగా నడుచుకున్నందుకే పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నట్టు లాలూ చెప్పారు. తేజ్ చేస్తున్న పనులు, ఆయన తీరు తమ కుటుంబ విలువలకు లోబడి లేవని, అందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని లూలూ చెప్పారు. తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఆర్జేడీకి, కుటుంబానికి ఎలాంటి బంధాలు లేవని స్పష్టం చేశారు. దీనిపై తేజ్ ప్రతాప్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.