Site icon Prime9

Richa Chadha: గాల్వాన్ ఘర్షణపై వివాదంగా మారిన రిచా చద్దా ట్వీట్..

Richa Chadha

Richa Chadha

Richa Chadha: బాలీవుడ్ నటి రిచా చద్దా 2020 గాల్వాన్ ఘర్షణపై చేసిన ట్వీట్‌ వివాదానికి దారితీసింది, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలపై రిచా ట్వీట్‌లో ‘గాల్వాన్ సేస్ హాయ్’ అని రాశారు.

దీనిపై పలువురు నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఆమె ట్వీట్ గాల్వన్ వీరులను ఎగతాళి చేసేలా మరియు భారత సాయుధ దళాల స్ఫూర్తిని “అవమానించేలా ఉందని నిందించారు. ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇటీవలి కాలంలో, భారతీయ సైన్యం యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తూ మరియు దేశభక్తి సందేశాలను పంపే షేర్షా, యూరి తదితర చిత్రాలు విడుదలయ్యాయి.

2020 జూన్ 15-16 మధ్య రాత్రి భారత్ మరియు చైనా దళాల మధ్య గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది, . లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)కి సంబంధించి యథాతథ స్థితిని మార్చడానికి మరియు భారత భూభాగంలో చొరబడటానికి చైనా సైనికులు చేసిన ప్రయత్నాలను బారత దళాలు తిప్పికొట్టాయి. ఈ ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు మరణించారు.

Exit mobile version