Site icon Prime9

Digital Rupee: డిజిటల్ రూపాయి (ఇ-రూపీ)పై ఆర్బీఐ తీపి కబురు

RBI sweet talk on Digital Rupee (e-Rupee)

RBI sweet talk on Digital Rupee (e-Rupee)

Reserve bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశ పౌరులకు తీపి కబురు అందించింది. బ్యాంకు ఖాతాతో పనిలేకుండా నగదు లావాదేవీలను చేపట్టే డిజిటల్ రూపాయిని (ఇ-రూపీ)ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్ధిక కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, అక్రమ నగదు చెలామణీకి డిజిటల్ రూపీ చెక్ పెట్టనుంది. పూర్తి స్థాయిలోకి ఆచరణలోకి వచ్చిన తర్వాత అంచలంచలుగా నోటు కరెన్సీ వినియోగం తగ్గనుంది. ప్రస్తుతానికి నగదు నోటుకు జతగా డిజిటల్ రూపాయి వినియోగంలో ఉంటుంది.

సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ )సీబీడీసీ) గా వ్యవహరించే ఇ-రూపీపై నమూనా పత్రంను ఆర్బీఐ విడుదల చేసింది. డిజిటల్ రూపాయి వాడకం విధానంలో రిటైల్, టోకు అవసరాలకు వినియోగించేలా వర్గీకరించారు. రిటైల్ సీబీడీసీని పౌరులందరూ వినియోగించుకోవచ్చు. టోకు సీబీడీసీ కరెన్సీని ఎంపిక చేసిన ఆర్ధిక సంస్ధలు మాత్రమే వినియోగిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 60 కేంద్ర బ్యాంకులు సీబీడీసీపై ఆసక్తి చూపాయని ఆర్బీఐ పేర్కొనింది.

దీంతో నోట్లు, నాణాల ముద్రణ, నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం, చెల్లింపుల్లో పోటీ సామర్ధ్యం, విదేశీ లావాదేవీలను మరింతగా మెరుగు పరచుకోవడం, క్రిప్టో ఆస్తుల నుండి సామాన్యుడికి రక్షణ, దేశ కరెన్సీపై విశ్వాసం పెంచుకొనేందుకు ఆర్బీఐ డిజిటల్ రూపాయి విధానాంపై మొగ్గు చూపింది.

నోటు ద్వారా చేస్తున్న చెల్లింపులు ప్రస్తుతానికి వాణిజ్య బ్యాంకుల పర్యవేక్షణ, బాధ్యతలో ఉన్నాయి. సీబీడీసీ చెల్లింపులకు ఆర్బీఐ బాధ్యత వహించేలా చేసిన మార్గం డిజిటల్ రూపాయి బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడనుంది.

ఒక విధంగా సీబీడీసీ అనేది కేంద్ర బ్యాంకు జారీ చేసే కరెన్సీ, ఆర్బీఐ బ్యాలెన్స్ షీటులో ఇది కనిపిస్తుంది. అన్ని రంగాల ప్రజలు, సంస్ధలు, ప్రభుత్వ ఏజెన్సీలు చట్టబద్ద చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. వాణిజ్య బ్యాంకుల్లో చలామణి అవుతున్న నగదుతో దీనిని మార్చుకోవచ్చు. నగదు జారీ, లావాదేవీల వ్యయం అనేది డిజిటల్ రూపాయి విధానంలో లేకుండా చేశారు.

మరీ ముఖ్యంగా ఈ మద్య కాలంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి ఆదరణ బాగా పెరిగింది. అయితే వాటి ద్వారా మనీ లాండరింగ్ (అక్రమ నగదు చెలామణీ), దేశ నాశనానికి చేయడానికి చేపట్టే అనేకులకు నిధులు ఇవ్వడం వంటివి క్రిప్టో ద్వారా చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశీయ కరెన్సీ తో పాటుగా ప్రజలకు నష్టం, భయం లేని వర్చువల్ కరెన్సీని అందించే క్రమంలో డిజిటల్ రూపాయిను సీబీడీసీ రూపంలో ప్రవేశపెట్టడమే తమ ఉద్ధేశంగా ఆర్బీఐ తన నమూనా పత్రంలో పేర్కొనింది.

మొత్తం మీద డిజిటల్ రూపాయి విధానం దేశంలో పెను మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జీరో బిజినెస్ చాలా వరకు మాయమౌతుంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్ధిక బలోపేతానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. డిజిటల్ రూపాయి విధానాన్ని ప్రజలకు దరిచేసి దేశ ఆర్ధిక వ్యవస్ధను పటిష్టం చేయడంతోపాటు, దొంగ నోట్ల చెలామణిని కూడా అంతం చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే మన దేశంలో అక్రమ వ్యాపారాలు చేసే వారి సంఖ్య లక్షల కోట్లల్లో ఉంది. దాన్ని సక్రమైన మార్గాల్లో తీసుకెచ్చేందుకు డిజిటల్ కరెన్సీని ప్రజలు ఆదరిస్తారా అనేది సంశయం. ఒక దశలో నోట్ల చెలామణికి అవసరమయ్యే కరెన్సీ ముద్రణ ఇకపై ఆర్బీఐ తక్కువగా చేపట్టే అవకాశాలు ఉండవచ్చు. కరెన్సీ లావాదేవీల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ఆ రంగంపై ఆధారపడిన నోట్ కౌంటింగ్ మిషన్ తయారీతోపాటు కొన్ని అనుబంధ సంస్ధల భవిష్యత్ అయోమయంగా మారనుంది.

ఇది కూడా చదవండి:Fake Notes: గుజరాత్ లో రూ.25.80కోట్ల నకిలీ నోట్లు.. పట్టుబడ్డ నోట్లన్నీ రెండు వేల రూపాయలే

Exit mobile version