RBI imposes restrictions on Mumbai-based New India Co-op Bank: ఆర్బీఐ మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంకు వద్దకు ఖాతాదారులు తరలివచ్చారు. ఈ మేరకు బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. సేవింగ్స్ నగదును విత్ డ్రా చేసుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే అధికారులు బ్యాంకు కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఎలాంటి విత్ డ్రాలు కుదరవని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.
కాగా, కస్టమర్ల నుంచి డిపాజిట్లు, పెట్టుబడులు స్వీకరించరాదని, అప్పులు చెల్లించేందుకు డబ్బులు ఇవ్వరాదని, ఆస్తులను అమ్మరాదని ఆదేశించింది. బ్యాంకు లిక్విడిటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సేవింగ్ బ్యాంకగ, కరెంట్ అకౌంట్, ఇతర అకౌంట్ల నుంచి విత్ డ్రాకు అనుమతి ఇవ్వొద్దని సూచించింది. అయితే కస్టమర్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే బ్యాంకును వెంటనే మూసివేయాలని ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.
అలాగే, ఆరు నెలల వరకు న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకు ఎలాంటి లావాదేవీలు జరపకూడదని తెలిపింది. సేవింగ్స్, కరెంట్ ఖాతాలే కాకుండా ఎలాంటి ఇతర ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా లేదా డిపాజిట్లు చేసుకునేందుకు వీలు లేదని తెలిపింది. అయితే తమ డబ్బులను ఇప్పించాలని బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన చేపడుతున్నారు.