Site icon Prime9

Rattan Lal Kataria: కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ రతన్‌లాల్‌ కన్నుమూత

kataria

kataria

Rattan Lal Kataria: హర్యానాకు చెందిన భాజపా ఎంపీ.. రతన్ లాల్ కటారియా కన్నుమూశారు. కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో ఈయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు.

సీఎం సంతాపం..

హర్యానాకు చెందిన భాజపా ఎంపీ.. రతన్ లాల్ కటారియా కన్నుమూశారు. కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో ఈయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు.

ప్రస్తుతం రతన్ లాల్ కటారియా హర్యానాలోని అంబాలా నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 నుంచి 2021 వరకు కేంద్రమంత్రిగా పని చేశారు.కేంద్ర జల్‌శక్తి, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆయన కొంతకాలంగా.. న్యూమోనియాతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రతన్ లాల్ చండీగఢ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. మాజీ కేంద్రమంత్రి మృతి పట్ల.. హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర స్పీకర్ చంద్ గుప్తా కూడా సంతాపం ప్రకటించారు. గురువారం సాయంత్రం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1999, 2014లో అంబాలా నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కుమారి సెల్జా చేతిలో ఓటమిని చవిచూశారు.

 

Exit mobile version