Site icon Prime9

Uttar Pradesh: 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేసాయన్న పోలీసులు.. ప్రూఫ్స్ చూపించమన్న కోర్టు

Rats

Rats

Uttar Pradesh: 500 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయని మధుర పోలీసులు ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఎన్‌డిపిఎస్ చట్టం కింద నమోదైన కేసులో 586 కిలోల గంజాయి రికవరీ చేయబడింది. దానిని సమర్పించమని కోర్టు పోలీసులను కోరినప్పుడు, పోలీసులు కోర్టుకు ఈ విధంగా తెలిపారు.

రెండు కేసుల్లో ఈ గంజాయిని షేర్‌గఢ్ మరియు హైవే పోలీస్ స్టేషన్‌లు స్వాధీనం చేసుకున్నాయి. పోలీస్ స్టేషన్‌లో ఎలుకల నుండి సురక్షితంగా నిల్వ చేసే స్థలం లేదని పోలీసు ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఎలుకలు సరుకును ధ్వంసం చేసిన తరువాత, మిగిలిన భాగాన్ని పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. పరిమాణంలో చిన్నవి కావడంతో, ఎలుకలకు పోలీసులంటే భయం ఉండదు. అలాగే పోలీసు అధికారులను సమస్యను పరిష్కరించడంలో నిపుణులుగా పరిగణించలేము”అని ప్రాసిక్యూటర్‌ పేర్కొన్నారు.

195 కిలోల గంజాయిని ఎలుకలు నాశనం చేశాయని హైవే పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసును ప్రస్తావించిన కోర్టు, ఎలుకలను నిర్మూలించాలని, అలాగే ఎలుకలు వాస్తవానికి 581 కిలోల గంజాయిని తిన్నాయని రుజువు చేయాలని ఎస్‌ఎస్‌పి మధురను ఆదేశించింది. నవంబర్ 26లోగా దీనికి సంబంధించి రుజువు సమర్పించాలని పోలీసు బృందాన్ని కోరింది. పోలీసు గోదాముల్లో నిల్వ ఉంచిన గంజాయిని వేలం వేయవచ్చు లేదా పారవేయడం ఎలా అనే దానిపై కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version
Skip to toolbar