Parliament Building Design: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కొనసాగుతున్న వివాదం మధ్య, లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ ) కొత్త భవనం డిజైన్‌ను శవపేటికతో పోల్చింది.”ఇది ఏమిటి” అనే శీర్షికతో కొత్త పార్లమెంటు భవనం చిత్రంతో పాటు శవపేటిక చిత్రాన్ని ఆదివారం ఆర్జేడీ ట్వీట్ చేసింది.
శవపేటికలో మిమ్మల్ని సమాధి చేస్తారు..(Parliament Building Design)
కొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చడంపై ఆర్‌జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ స్పందిస్తూ మా ట్వీట్‌లోని శవపేటిక ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడాన్ని సూచిస్తుంది. దీన్ని దేశం అంగీకరించదు. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం మరియు చర్చలు జరపడానికి ఇది వేదికని అన్నారు. ఈ ట్వీట్ చేసిన వెంటనే, భారతీయ జనతా పార్టీ, కొత్త పార్లమెంట్ భవనం డిజైన్‌ను శవపేటికతో పోల్చిన వ్యక్తులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని పేర్కొంది.2024లో దేశ ప్రజలు మిమ్మల్ని ఈ శవపేటికలోనే సమాధి చేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. మరోవైపు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆర్జేడీ ట్వీట్ ను తప్పు బట్టారు.
ఆర్జేడీని తప్పు బట్టిన అసదుద్దీన్ ఒవైసీ ..
ఆర్జేడీకి స్టాండ్ లేదు, పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ కూడా లేదు. వారు పార్లమెంటును శవపేటిక అని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్లు ఇంకేమైనా మాట్లాడి ఉండవచ్చు, ఈ కోణాన్ని ఎందుకు తీసుకురావాలి? అని ఒవైసీ ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో చేతులు కలపడంతోపాటు పార్లమెంటుకు కొత్త భవనం అవసరమని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ దివంగత అధినేత ములాయం సింగ్ యాదవ్ పాత పార్లమెంట్ భవనంలోని తన పార్టీ కార్యాలయంలో భోజనం చేస్తున్న సమయంలో సీలింగ్‌లో కొంత భాగాన్ని ఆయనపై పడడాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.