Ramnath Shiva Ghela Temple: పరమశివుడికి నాన్‌వెజ్.. బతికున్న పీతలే నైవేద్యం.. గుజరాత్ ఆలయంలో వింత ఆచారం

Ramnath Shiva Ghela Temple: సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు పండ్లు, పూలు, కొబ్బరి కాయలు..స్వీట్స్ నైవేద్యంగా సమర్పిస్తాము.

కానీ గుజరాత్ లోని ఓ ఆలయం లో విచిత్రంగా పీతల(Crabs)ను సమర్పిస్తారు. దేవుడికి పీతలు సమర్శించడం ఏంటని అనుకుంటున్నారా? వింతగా ఉన్నా.. ఇది నిజం.

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని రామ్ నాథ్ ఘోలా మహదేవ్ ఆలయం(Ramnath Shiva Ghela Temple) ఉంది. ఈ శివాలయానికి వచ్చే భక్తులు స్వామి వారి అభిషేకం కోసం బతికున్న పీతలను తీసుకొస్తారు.

అభిషేక ప్రియుడు శివుడికి కొంచెం నీళ్లు పోసినా కరుణిస్తాడని నానుడి. కానీ ఇక్కడ మాత్రం ఆ శివయ్య విచిత్ర అభిషేకాలు అందుకుంటున్నాడు.

శివుడికి పీతలతో అభిషేకం అనంతరం వాటినే నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది.

శ్మశానంలో ఆలయం(Ramnath Shiva Ghela Temple)

రామ్ నాథ్ ఘేలా శ్మశానంలో ఈ ఆలయం ఉంది. ప్రతి రోజూ ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

ఏడాది ఓకసారి మాఘమాస ఏకాదశి రోజు ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తారు. ఈ సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు(devotees) వేల సంఖ్యలో వస్తారు.

తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ.. బతికున్నపీతలను తీసుకొచ్చి శివునికి అభిషేకం నిర్వహిస్తారు.

పీతను సమర్పించడం ద్వారా అన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారని స్ధానికుల నమ్మకం.

ముఖ్యంగా చెవి నొప్పితో బాధపడే వారు ఎక్కువగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

శివాలయంలో పూజలు చేసి శ్మశానంలోని తమ బంధువల సమాధుల వద్ద ప్రత్యేకలు ప్రార్థనలు నిర్వహిస్తారు.

దేశంలోని అన్ని దేవాలయాల్లో పూలు, పండ్లతో పాటు పలు నైవేద్యాలు పెట్టడం చూసుంటాం..

కానీ బతికున్న పీతల(Crabs)ను దేవుడికి నైవేద్యంగా పెట్టే ఆలయాన్ని దేశంలో మరిక్కెడా చూడకపోవచ్చు అంటున్నారు ఇక్కడి స్థానికులు.

స్తంభేశ్వర ఆలయం కూడా ప్రత్యేకమే..

అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రంలోని మరో ఆలయం కూడా చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. వడోదరాకు సమీపంలో స్తంభేశ్వర మహాదేవ ఆలయం ఉంది.

ఈ దేవాలయం అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఈ దేవాలయం రోజులో కొంతసేపు మాత్రమే భక్తులకు కనిపిస్తూ ఉంటుంది.

ఈ మహదేవ ఆలయం ఎప్పుడూ సముద్రం లోపలే ఉండడం వల్ల అలలపోటు తక్కువగా ఉన్నప్పుడే భక్తులకు కనిపిస్తుంది. ఆ టైంలో మాత్రమే భక్తులు స్వామిని దర్శించుకుంటారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/