Railway Passengers: చెన్నై నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లే తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు మృతదేహంతో పాటు సుమారు 600 కి.మీ. ప్రయాణించవలసి వచ్చింది. రైలు జనరల్ కోచ్‌లో ఒక వ్యక్తి మరణించినా రైల్వే అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఈ పరిస్దితి తలెత్తింది.
మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన 36 ఏళ్ల రామ్‌జీత్ యాదవ్‌గా గుర్తించారు, అతను చెన్నైలో పని చేస్తున్నాడు.అతను తన బంధువయిన గోవర్ధన్‌తో కలిసి ఇంటికి వెళ్తున్నాడు.ఆదివారం, రైలు నాగ్‌పూర్‌కు చేరుకున్నప్పుడు రామ్‌జీత్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి మరణించాడు. గోవర్ధన్ సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం రైలు భోపాల్ చేరుకున్నప్పుడు, ప్రయాణికులు పరిస్థితి గురించి మరోసారి అధికారులకు సమాచారం అందించినా వారు స్పందించలేదు రైలు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వద్దకు చేరుకోగానే మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.ఈ సంఘటన ఇపుడు వెలుగులోకి వచ్చింది.