Site icon Prime9

Rahul Gandhi: లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌గాంధీ?

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోకసభ ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. మెజారిటీ మార్కుకు 272 సీట్లకు గాను 240 సీట్ల వద్ద చతికిలపడింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఫుల్‌ జోష్‌లో ఉంది. అంచనాకు మించి సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 99 సీట్లు సాధించుకుంది. లోకసభలో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే చర్చ జరుగుతోంది. కాగా నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడోసారి పగ్గాలు చేపడుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష పార్టీలు లోకసభలో ప్రతిపక్ష నాయకుడి ఎంపికపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి.

త్వరలో తుది నిర్ణయం..(Rahul Gandhi)

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌గాంధీని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై తుది నిర్ణయం త్వరలో కాంగ్రెస్‌ పార్టమెంటరీ పార్టీ సమావేశం తీసుకుంటుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాకూర్‌ మాత్రం బహిరంగంగానే రాహుల్‌ గాంధీని లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేద్దామనే ప్రతిపాదనను తీసుకువచ్చారు. రాహుల్‌ పేరుపై ఓట్లు అడిగాం కాబట్టి ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయడమే న్యాయమని సూచించారు. తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ. కాంగ్రెస్‌ ప్రజాస్వామిక పార్టీ రాహుల్‌ గాంధీ కాషాయ గుండాలను కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడిన ఇమేజ్‌లను ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

ఇదిలా ఉండగా లోకసభలో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే కనీసం 55 సీట్లు గెలవాల్సి ఉంటుంది. అయితే 2014లో జరిగిన ఎన్నికలల్లో కాంగ్రెస్‌ పార్టీ 44 సీట్లు దక్కించుకోగా.. 2019లో 52 సీట్లు గెలిచింది. అయితే ఈ సారి 99 స్థానాలు దక్కించుకుంది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ ఎంపికయ్యే అవకాశాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయి. అదీ కాకుండా ఇండియా కూటమి గెలుపునకు రాహుల్‌ విశేష కృషి చేశారు. ఇటీవల ఉద్దవ్‌ థాకరేకు చెందిన సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ ఇండియా కూటమి తరపున రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనుకున్నా ఎవ్వరూ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని అన్నారు. కాగా చంద్రబాబు, నితీష్‌ కుమార్‌లు మాత్రం తాము ఎన్‌డీఏ వెంటనే నడుస్తామని ప్రకటించారు.

Exit mobile version