Prime9

MP Rahul Gandhi : ట్రంప్ ఫోన్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారు.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi’s key comments on Operation Sindoor : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని, ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌పై ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడ్డారని విమర్శించారు. నరేందర్.. సరెండర్ అనగానే బెదిరిపోయాడన్నారు. ట్రంప్ భయంతోనే పాక్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని ఎద్దేవా చేశారు. గతంలో పాక్‌తో యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ ఎవరికీ భయపడలేదని గుర్తుచేశారు. చైనా, పాక్‌కు భారత్ సత్తా ఏంటో ఆమె చూపించారన్నారు. సరెండర్ కావడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు అలవాటేనని విమర్శించారు.

 

ఇంతకు ముందు కూడా ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తోపాటు, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్’లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ ఘటనపై రాహుల్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి ముందు కేంద్రం పాక్‌కు సమాచారం ఇచ్చినట్లు ఆరోపిస్తు రాహుల్ సంచలన ఆరోపణలకు తెరతీశారు. ట్వీట్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇది వరువక ముందే ఆయన ఇవాళ మరోసారి ఆపరేషన్ సిందూర్‌పై హాట్ కామెంట్స్ చేశారు.

Exit mobile version
Skip to toolbar