Site icon Prime9

Ananth Ambani : రాధిక మర్చంట్‌ తో – అనంత్ అంబానీ నిశ్చితార్దం… రాజస్థాన్‌లో ‘రోకా’ వేడుక

AMBANI

AMBANI

Ananth Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో గురువారం నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో ‘రోకా’ వేడుకను నిర్వహించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ పరిమల్ నత్వానీ ట్విట్టర్‌లో అనంత్ మరియు రాధికల రోకా వేడుకను ధృవీకరించారు. నాధ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగిన రోకా వేడుకకు ప్రియమైన అనంత్ మరియు రాధికలకు హృదయపూర్వక అభినందనలు. భగవాన్ శ్రీనాథ్ జీ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్‌ చేసారు.

ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలలో అనంత్ అంబానీ చిన్నవాడు, మిగిలిన ఇద్దరు ఆకాష్ మరియు ఇషా. 1995లో జన్మించిన అనంత్ అంబానీ వ్యాపార సామ్రాజ్యానికి వారసుల్లో ఒకరు. అనంత్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పాఠశాల విద్య తర్వాత యూఎస్ లోని రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్‌ చేసారు. అనంత్ మరియు రాధిక మర్చంట్ చిన్ననాటి స్నేహితులు.

రాధిక మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ . రాధిక మర్చంట్ తండ్రి వీరేన్ మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ యొక్క సీఈవో.. ఆమె ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌కు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆమె గురు భావనా థాకర్ మార్గదర్శకత్వంలో ముంబైలోని ప్రసిద్ధ శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీ నుండి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది.రాధిక ఈ ఏడాది జూన్ లో జియో వరల్డ్ సెంటర్‌లో అంబానీలు నిర్వహించిన గ్రాండ్ ఆరంగేట్రం వేడుకలో నృత్యప్రదర్శన ఇచ్చి వార్తల్లో కెక్కారు.

Exit mobile version