Site icon Prime9

Pune Minor Car Accident Case: పూనే మైనర్ కారు యాక్సిడెంట్ కేసు.. ఇద్దరు డాక్టర్ల అరెస్ట్

pune

pune

Pune Minor Car Accident Case: పూనేలో ఓ మైనర్‌ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి నిండు ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. పూనేకు చెందిన టాప్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ కుమారుడు 12వ తరగతి పరీక్ష పాసైన సందర్భంగా తన మిత్రులతో కలిసి పబ్‌లో పార్టీ చేసుకున్నాడు. పార్టీ ముగిసిన తర్వాత మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు స్టాప్‌వేర్‌ ఉద్యోగులను బలిగొన్నాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తులను బలి తీసుకున్న తర్వాత పలు నాటకీయ పరిణామలు చోటు చేసుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారును డ్రైవర్‌ నడిపాడని నెపాన్ని డ్రైవర్‌పై నెట్టడానికి చేయని ప్రయత్నం లేదు. డ్రైవర్‌కు డబ్బు ఆశ జూపారు. డ్రైవర్‌ నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. రెండు రోజుల పాటు డెవలపర్‌ ఇంట్లోనే బంధించి తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. రెండు రోజుల నుంచి తన భర్త రాలేదని, మైనర్‌ ఇంటి వద్ద ఆమె గొడవ చేస్తే తప్ప డ్రైవర్‌ను వదలలేదు.

సాక్ష్యాలు తారుమారు..(Pune Minor Car Accident Case)

తాజాగా మరో కొత్త కోణం వెలుగు చూసింది. పూనే పోలీసు కమిషనర్‌ అమితేష్‌కుమార్‌ సమాచారం ప్రకారం ప్రభుత్వ ఆస్ప్రతి సాసూన్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు మైనర్‌ బాలుడికి రక్తపరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాత పాత బ్లడ్‌ శాంపిల్స్‌ డస్ట్‌బిన్‌లో పారేశారు. వాటిలో స్థానంలో వేరే వ్యక్తి బ్లడ్‌ శాంపిల్స్‌ పెట్టారు.కాగా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు ఇద్దరు డాక్టర్లను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సోమవారం నాడు చెప్పారు. కాగా ప్రమాదం జరిగిన రోజు రాత్రి 11 గంటలకు 17ఏళ్ల మైనర్‌ బాలుడిని వైద్య పరీక్షల కోసం సాసూన్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరెటరీ నివేదిక ప్రకారం రక్త పరీక్షలో ఆల్కాహాల్‌ లేదని రిపోర్టు రావడంతో పలు అనుమానాలు తలెత్తాయి.

అయితే రెండో సారి రక్తపరీక్షలు వేరే ఆస్పత్రిలో నిర్వహించడంతో పాటు డీఎన్‌ఏ టెస్టులు కూడా చేయడంతో వాస్తవాలు వెలగుచూశాయి. పోలీసులకు అనుమానాలు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు సాక్ష్యాలు తారుమారు చేశారని నిర్ధారణకు వచ్చి అరెస్టు చేశారు. డాక్టర్‌ శ్రీహరి హల్‌నోర్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. కాగా శ్రీహరి మైనర్‌ రక్తపరీక్షలు సేకరించాడు. విచారణలో డాక్టర్‌ అజయ్‌ తావారే ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ హెడ్‌ ఆదేశాల ప్రకారమే తాను బ్లడ్‌ శాంపిల్స్‌ మార్చానని చెప్పారు. దీంతో ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై నేరపూరితమైన కుట్ర, ఫోర్జరీ, సాక్ష్యాలు తారుమారు చేసినట్లు కేసు నమోదు చేశారు.మైనర్‌ బాలుడి తండ్రి పూనేలో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ విశాల్‌ అగ్రవాల్‌, బాలుడి తాతకు కూడా అండర్‌ వరల్డ్‌లో సంబంధాలున్నాయన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇద్దరిని ఈ కేసులో అరెస్టు చేశారు. వీరిద్దరిపై లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని.. అలాగే డ్రైవర్‌ కుటుంబానికి బెదిరించారని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version