Site icon Prime9

Pune Cop: ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్11లో రూ. 1.5 కోట్లు గెలుచుకున్న పూణే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్.

Pune Cop

Pune Cop

Pune Cop: ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్11లో రూ. 1.5 కోట్లు గెలుచుకుని మిలియనీర్‌గా మారిన పూణే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. పూణెలోని పింప్రి-చించ్వాడ్ పోలీసులు అతనిపై దుష్ప్రవర్తన మరియు పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు.

అనుమతి లేకుంగా గేమ్ ఆడి..(Pune Cop)

సబ్-ఇన్‌స్పెక్టర్, సోమనాథ్ జెండే, ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్ 11లో భారీ మొత్తాన్ని గెలుచుకున్నారు, పోలీసు శాఖ దీనిపై శాఖాపరమైన చర్య తీసుకుంది., పింప్రి-చించ్వాడ్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించారు. జెండే అనుమతి లేకుండా ఆన్‌లైన్ గేమ్ ఆడాడని, పోలీసు యూనిఫాం ధరించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడని విచారణలో తేలింది. అనంతరం విధుల నుంచి సస్పెండ్‌ అయ్యారు.విచారణకు నాయకత్వం వహించిన డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, స్వప్నా గోర్ మాట్లాడుతూ అతను అనుమతి లేకుండా డ్రీమ్ 11 గేమ్ ఆడినట్లు తేలింది, ఇది అతని సస్పెన్షన్‌కు దారితీసిందని అన్నారు. ఇది ఇతర పోలీసు సిబ్బందికి హెచ్చరిక లాంటిది. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటం వలన, వారు కూడా క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.

Exit mobile version