Cash Throwing Protest: మహారాష్ట్రలో మంత్రికి వ్యతిరేకంగా రోడ్లపై కరెన్సీ నోట్లను విసురుతూ నిరసన.. ఎందుకో తెలుసా?

ఓ పురుగుమందుల కంపెనీ, మరికొన్ని సంస్థలు నాసిరకం మందులను అందిస్తున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని హింగోలిలో స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు సోమవారం  రోడ్లపై  కరెన్సీ నోట్లు విసిరి ప్రత్యేక నిరసన చేపట్టారు.

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 06:52 PM IST

 cash Throwing Protest: ఓ పురుగుమందుల కంపెనీ, మరికొన్ని సంస్థలు నాసిరకం మందులను అందిస్తున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని హింగోలిలో స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు సోమవారం  రోడ్లపై  కరెన్సీ నోట్లు విసిరి ప్రత్యేక నిరసన చేపట్టారు.వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్‌, వ్యవసాయ శాఖ కు వ్యతిరేకంగా వారు ఈ నిరసన చేపట్టారు.

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..( Cash Throwing Protest)

పురుగుమందుల కంపెనీతో పాటు మరో ఏడు కంపెనీలు రైతులకు తప్పుడు మందులను విక్రయించాయని ఆందోళనకారులు పేర్కొన్నారు.కంపెనీలు విక్రయిస్తున్న మందులపై స్థానిక రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు వ్యవసాయ మంత్రికి వ్యతిరేకంగా ప్రత్యేక నిరసనలకు దిగారు. ఇందులో భాగంగా హింగోలి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట వారు ‘నోట్లు విసిరి నిరసన’ నిర్వహించారు.