Site icon Prime9

Priyanka Gandhi: వయనాడ్ నుంచి ఎంపీ గా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ

priyanka Gandhi

priyanka Gandhi

Priyanka Gandhi:  గాంధీ కుటుంబం నుంచి మరొకిరు రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ దక్షిణాదిన వాయనాడ్‌ నుంచి అటు ఉత్తరాది రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల భారీ మెజారిటీ గెలుపొందారు. ఇక గెలుపొందిన తర్వాత ఏ సీటు ఉంచుకోవాలో ఏది త్యజించాలో మల్లగుల్లాలు పడ్డారు. చివరకు తెగించి ఆయన రాయబరేలి సీటును ఉంచుకొని వాయనాడ్‌ సీటును త్యాగం చేయాలని నిర్ణయించారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో..(Priyanka Gandhi)

ఇక ఖాళీ అయిన వాయనాడ్‌ నుంచి తన సోదరి ప్రియాంకాను బరిలో నిలపాలని కాంగ్రెస్‌ అధిష్టానం సోమవారం నాడు నిర్ణయించింది. అయితే రాహుల్‌ రాయ్‌బరేలీనే ఎందుకు ఎంచుకున్నారన్న విషయానికి వస్తే.. 2027లో ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించింది. 2022లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ చేతిలో కాంగ్రెస్‌ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. యూపీ ఇన్‌చార్జిగా ప్రియాంకాగాంధీ వ్యవహరించారు. ఆమె నాయకత్వంలో కేవలం రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పాగా వేయడానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాహుల్‌ నిర్ణయించారు. అందుకే రాయ్‌బరేలీని ఉంచుకొని వాయనాడ్‌ను వదులుకోవాలన్న టాక్‌ కాంగ్రెస్‌ పార్టీలో వినిపిస్తోంది.

ఇక ప్రియాంకా గాంధీ విషయానికి వస్తే ఆమె ఇటీవలి కాలం వరకు కాంగ్రెస్‌ పార్టీకి పరోక్షంగా సహాయ సహకారాలు అందించారు. ఇక ఇప్పుడు ఆమె కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన సోదరుడి విజయం కోసం ..కాంగ్రెస్‌ పార్టీ కోసం ఆమె తన శాయశక్తులా ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆమెకు సురక్షితమైన సీటు కోసం అన్వేషించి చివరకు తన సోదరుడి స్థానం నుంచి నిలబెట్టాలనుకుంది. ఇక కేరళ విషయానికి వస్తే కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టు ఉంది. ..ఇక ప్రియాంకా గాంధీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా .. రారా అనే ఊహగానాలకు సోమవారం రాత్రితో తెరపడింది. ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రియాంకా గాంధీ వాయనాడ్‌ లోకసభ నియోజకవర్గం నుంచి తన రాజకీయ అరగేట్రం చేస్తారని కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.

ఇక రాహుల్‌ విషయానికి వస్తే ఆయన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించారు. గాంధీ కుటుంబానికి రాయ్‌బరేలి కంచుకోట.. రాహుల్‌ తల్లి సోనియాగాంధీ కూడా ఇక్కడి నుంచి నాలుగుసార్లు పోటీ చేసి గెలుపొందారు.లోకసభలో ఆమె రాయబరేలికి ప్రాతినిధ్యం వహించారు. ఇక ప్రియాంకా గాంధీ వాద్రా విషయానికి వస్తే 2019 నుంచి రాజకీయాల్లోకి వస్తారన్న టాక్‌ వినిపించింది. కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన ప్రియాంకా పార్లమెంటులో ముగ్గరు గాంధీలు ఉంటే బాగుంటుందా అని ఒకసారి ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఆమె కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి అంగీకరించారు. కాంగ్రెస్‌పార్టీకి వాయనాడ్‌ ఎంతో కీలకమని ఆమెను పార్టీ సీనియర్లు ఒప్పించారని రాహుల్‌గాంధీ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Exit mobile version