Site icon Prime9

Odisha CM Naveen Patnaik: ఒడిషా ముఖ్యమంత్రి ఆరో గ్యంపై ప్రధాని వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన నవీన్ పట్నాయక్ ..

CM Naveen Patnaik

CM Naveen Patnaik

Odisha CM Naveen Patnaik:  ఒడిషా ముఖ్యమంత్రి బిజూ జనతాదళ్‌ (బీజేడీ) సుప్రీమో నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బదులుగా పట్నాయక్‌ స్పందిస్తూ.. తన ఆరోగ్యం బేషుగ్గా ఉంది. గత నెల రోజుల నుంచి రాష్ర్టంలో ఎన్నికల ప్రచారం కూడా చేశానని చెప్పుకొచ్చారు. అయితే ఒడిషా ముఖ్యమంత్రి పట్నాయక్‌ ప్రస్తుతం లోకసభ ఎన్నికలు జరుగుతన్న సమయంలో మీడియాతో మాట్లాడ్డం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఓట్ల కోసం ప్రధాని ఎత్తుగడ..(Odisha CM Naveen Patnaik)

కాగా నవీన్‌ పట్నాయక్‌ గురువారం నాడు ప్రత్యేకంగా ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బుధవారం నాడు ప్రధాని నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకున్నారు. కాగా మోదీ మాత్రం బీజేడీ నాయకుడు పట్నాయక్‌ క్షీణిస్తున్న ఆరోగ్యం వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నారు. దీనికి ఒడిషా సీఎం స్పందిస్తూ.. తన ఆరోగ్యంపట్ల ఆయన ఆందోళన చెందుతున్నట్లయితే ఆయనే నేరుగా తనకు ఫోన్‌ చేసి తన క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చు గదా అని ప్రశ్నించారు. దీనికి ఆయన బహిరంగ సభలో గొంతు చించుకొని అరవాల్సిన పనిలేదు కదా అని అన్నారు. ఓట్లు దండుకోవడానికి ప్రధాని చేస్తున్న ఎత్తుగడగా నవీన్‌ పట్నాయక్‌ తన ఆరోగ్యం గురించి మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్నారు.

బీజేపీ నేతల పుకార్లు..

ప్రధానమంత్రి మయూర్‌భంజ్‌ లోకసభ నియోజకవర్గంలోని బారిపాడలో ఓ బహిరంగసభలో మాట్లాడారు. జూన్‌ 1న ఇక్కడ పోలింగ్‌ జరుగనుంది. కాగా సభను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. అకస్మాత్తుగా నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నారు. ఓ కమిటిని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి హెల్త్‌ హిస్టరీపై విచారణ చేయిస్తామని ప్రధాని అన్నారు. తన ఆరోగ్యంపై దశాబ్దం కాలం నుంచి పుకార్లు సృష్టిస్తోందిమాత్రం బీజేపీ నాయకులని నవీన్‌ పట్నాయక్‌ ఆరోపించారు.

గత దశాబ్దకాలం నుంచి బీజేపీ నాయకులు ఢిల్లీలో ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారు. అయినా వారికి ఎలాంటి ఫలితం దక్కలేదు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని మరి మరి చెబుతున్నాను. మండుటెండలో గత నెల రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నానను. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానన్నారు బీజేడీ చీఫ్‌. అయితే ఆయన పాల్గొన్న ఎన్నికల ర్యాలీలో చేతులు వణుకుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని గురించి మీడియా అయనను ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ..దీనికి అనారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి కారణం లేకుండా తన ఆరోగ్యం గురించి చిలువలుపలువలు చేస్తున్నారని బీజేడీ ముఖ్యమంత్రి బీజేపీపై మండిపడ్డారు.

ఇక పట్నాయక్‌ విషయానికి వస్తే ఆయన వయసు 77 ఏళ్లు . 2000 సంవత్సరం నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలో ఓ రాష్ర్టంలో సుదీర్ఘకాలం పాటు పాలించిన సీఎం లేడు. ఆరవ సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలనే ఆలోచనలో నవీన్‌ పట్నాయక్‌ ఉన్నారు. కాగా రాష్ర్టంలో అసెంబ్లీతో పాటు లోకసభ ఎన్నికలు ఒకే సారి జరుగుతున్నాయి. ఇక్కడ మే 13 నుంచి జూన్‌ 1 వరకు నాలుగు విడతల్లో పోలింగ్‌ జరుగనుంది. కాగా ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నాయి.

Exit mobile version
Skip to toolbar