Site icon Prime9

Prime Minister Narendra Modi: విద్యార్థులతో ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’ .. వీడియో వైరల్

Prime Minister Narendra Modi in Pariksha Pe Charcha 2025 With Students: ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’ ప్రోగ్రామ్ మొదలైంది. ఈ మేరకు ఢిల్లీలోని సుందరవనంలో జరుగుతున్న పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్‌కు మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు సూచనలు, సలహాలు అందించారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడంతో పాటు తట్టుకోవడంపై విద్యార్థులకు సూచనలు చేశారు. అదే విధంగా నమో యాప్‌లోనూ పరీక్షా పే చర్చ ప్రోగ్రామ్ ప్రసారమవుతోంది.

ఈ కార్యక్రమం కోసం మొత్తం 3.15 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే 19.80 లక్షల మంది టీచర్లు, 5.20లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు. అయితే 36 మందితో పాటు కొంతమంది వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఇందులో భాగంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పలు ప్రశ్నలు అడగగా.. ఈ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం అందిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వీడియో రూపంలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పరీక్షలకు ప్రశాంతమైన వాతావరణంలో సిద్ధం కావాలని విద్యార్థులకు మోదీ సూచించారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివితే బాగా రాణించే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నారు. పరీక్షలు ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుకోవడం ముఖ్యమన్నారు. ఎందుకంటే అనారోగ్యకరమైన ఆహారాలు నీరసంగా మారుస్తాయని వివరించారు. దినచర్య అధ్యయన సమయం రూపొందించుకోవాలన్నారు. విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలన్నారు.

Exit mobile version
Skip to toolbar