Site icon Prime9

Pamban Bridge : పాంబన్‌ బ్రిడ్జి ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

Pamban Bridge

Pamban Bridge

Pamban Bridge : భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్‌ వంతెనను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలో మొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సముద్ర వంతెన ఇది. సముద్రంలో 2.08 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. వంతెన కింద భాగాన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్‌ లిఫ్ట్‌ ఉంటుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో దీనిని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2020లో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ పనులు చేపట్టారు. వంతెన నిర్మాణ పనులను నాలుగేళ్లలో పూర్తిచేసింది.

 

రామేశ్వరం-తాంబరం ప్రత్యేక రైలు ప్రారంభం..
ఈ సందర్భంగా రామేశ్వరం-తాంబరం ప్రత్యేక రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది కొత్త వంతెన మీదుగా పరుగులు తీసింది. ఈ క్రమంలోనే రైలులో విద్యార్థులు, ప్రయాణికులు సందడి చేశారు. వంతెన కిందుగా ప్రయాణించిన కోస్ట్‌ గార్డ్‌ నౌకకు పచ్చజెండా ఊపారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ రూ.8,300 కోట్ల విలువైన నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. తర్వాత రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహిస్తారు.

Exit mobile version
Skip to toolbar